Telugu News » భర్తలు బీ కేర్ ఫుల్..ఎందుకంటే ప్రేమంట.!!

భర్తలు బీ కేర్ ఫుల్..ఎందుకంటే ప్రేమంట.!!

సమాజం చేదాటిపోతోంది.వివాహ బంధాలు తృణ ప్రాయంగా తెగిపోయి వివాహేతర సంబంధాలు పటిష్ఠమవుతున్నాయి.

by sai krishna

సమాజం చేదాటిపోతోంది.వివాహ బంధాలు తృణ ప్రాయంగా తెగిపోయి వివాహేతర సంబంధాలు పటిష్ఠమవుతున్నాయి. స్త్రీ సహజ స్వభావమైన మృదుత్వం కఠినంగా మారుతోంది. కొంత మంది వివాహితులు ప్రియుడి కోసం భర్తను చంపేందుకు తెగబడుతున్నారు.

గతంలో ఇలాంటి ఎన్నో ఉదంతాలు జరుగగా…మరో ఉదంతం సగటు సెంటిమెంట్ భర్తలకు వెన్నులో వణుకుపుట్టించేట్టుగా పరిస్థితులు మారుతున్నాయ్. ఏపీలోని అనకాపల్లిజిల్లాలో ఓ వివాహిత ప్రియుడి సాయంతో భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రించాలని ట్రైచేసింది.

నర్సీపట్నం(Narsipatnam)ఏఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా(Adiraj Singh Rana)సమాచారం ప్రకారం హత్యజరిగిన నేపథ్యాన్ని పరిశీలిస్తే…భర్తతో ఉంటూనే ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది జానకి. అయితే..తన వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె..భర్త అప్పలనాయుడును శాశ్వతంగా అడ్డు తొలగించు కోవాలని నిర్ణయించుకుంది.

లవర్ రాముతో కలిసి ప్లాన్ చేసింది.ఇందులో భాగంగా ఈనెల 20 న కోటవురట్ల మండలం పాములవాక(Pamulavaaka)గ్రామంలో పట్టాలమ్మతల్లి (Pattalammathalli)గుడికి వెళ్దామని భర్తను కోరింది.భార్య ప్రేమగా చెప్పడంతో సరే అని భర్త అప్పలనాయుడు ఆమెను గుడికి తీసుకెళ్లాడు.

అమ్మవారి దర్శనం అయ్యాకా తిరుగు ప్రయాణమయ్యారు. తాండవ నది(Tandava River)రహదారి వైపు వెళ్లి సరదాగా గడుపుదామని చెప్పుకొచ్చింది భార్య. ఆమె మాటల వెనుక మర్మాన్ని గ్రహించలేని భర్త..సరే అన్నాడు. బైక్ పై ఇద్దరూ అటుగా వెళ్లారు. వెనుక కొంత దూరంలో జానకి ప్రియుడి చింతల రాము అనుసరిస్తున్నాడు.

జానకి, రాములు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాండవ నది గట్టు దాటిన తర్వాత కొంత దూరం వెళ్లాక జానకి తన భర్తతో బహిర్భూమికి వెళ్ళాలి..బండి ఆపమని చెప్పి రోడ్డు పక్కన గల జీడి తోటలోకి వెళ్లింది. కొద్దిసేపటికి..తోటల్లో కాసేపు సరదాగా గడుపుదామని ప్రేమతో భార్య చెప్పేసరికి ఆ భర్త సరేనన్నాడు. ఇద్దరూ తోటలో కూర్చున్నారు..భర్త తలను తన ఒడిలోకి తీసుకుని లాలించే సరికి మురిసిపోయిన అమాయక భర్త అప్పల నాయుడు.

భార్యంటే ఈమేరా అనుకుని మైమరచిపోయాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన జానకి ప్రియుడు రాము..వెనుక నుంచి వచ్చి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి అప్పల నాయుణ్ని రాయితో మోది జానకి చంపేసింది. జానకి వేసిన స్కెచ్ అంతటితో ముగియలేదు, హత్యానేరం తనపైకి రాకుండా ఉండడానికి శవంతో డ్రామా స్టార్ట్ చేసింది. భర్త అప్పలనాయుడు చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత..ఎవరూ లేని సమయంలో తోటలోంచి శవాన్ని రోడ్డుపైకి తీసుకు వచ్చారు.

రోడ్డుపై మృతదేహాన్ని పెట్టి..పక్కనే మోటారు సైకిల్ ను పడిపోయినట్టు సీన్ క్రియేట్ చేశారు. ఆపై రోడ్డుపైనే రోదించడం స్టార్ట్ చేసింది జానకి. రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయడని అటుగా వచ్చి పోయే వారికి చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. తొలుత అంతా నిజమే అనుకున్నారు.

పోలీసులకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మృతుడి శరీరంపై గాయాలను పరిశీలించి అనుమానంతో తమదైన శైలిలో కూపీ లాగేసరికి…అసలు విషయం బైటకు వచ్చింది. జానకి కీలక నేరస్తురాలిగా తేలింది.జానకి,రాములను పోలీసులు అరెస్ట్ చేశారు.

You may also like

Leave a Comment