Telugu News » Chandrayaan-3 : జాబిల్లికి చేరువలో చంద్రయాన్-3 .. గణనీయ స్థితిలో మిషన్

Chandrayaan-3 : జాబిల్లికి చేరువలో చంద్రయాన్-3 .. గణనీయ స్థితిలో మిషన్

by umakanth rao
chandrayan 3

 

Chandrayaan-3 : ఇస్రో (Isro) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడికి చేరువవుతోంది. ఈ నెల 1 న భూ కక్ష్యను వీడి 5 న చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-3 మెల్లగా జాబిల్లికి చేరువవుతోంది. ఈ వ్యోమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని(Maneuver) విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. సోమవారం నిర్వహించిన విన్యాసంతో దీని కక్ష్యను 150 కి.మీ. x 177 కి.మీ. లకు తగ్గించినట్టు పేర్కొంది. అంటే జాబిల్లి ఉపరితలానికి ఇది కేవలం 177 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది.

Chandrayaan-3 gets closer to moon, commences orbit circularisation phase - The Week

 

తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఈ నెల 16న ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చేపడతామని శాస్త్రజ్ఞులు తెలిపారు. దీంతో చంద్రయాన్-3 చంద్రునిపై 100 కి.మీ. ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరుతుందని, అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుందని వారు చెప్పారు.

అన్నీ సజావుగా జరిగితే ఈ నెల 23 సాయంత్రానికి ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకనుంది. ఈ వ్యోమనౌక దశలవారీగా తన ఆర్బిట్ సర్క్యులేషన్ ని పూర్తి చేసి తన చివరి గమ్యాన్ని చేరుకోబోతోంది.

చంద్ర ఉపరితలం మీద ఇది సురక్షితంగా దిగడానికి ఇస్రో శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. జాబిల్లిపైగల పరిసరాలు, మినరాలజీ, హైడ్రాక్సిల్, నీరు,ఐస్ వంటివాటిపై చంద్రయాన్-3 పరిశోధనలు చేస్తుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేసేందుకు \తాము అహర్నిశలు యత్నిస్తున్నామని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

You may also like

Leave a Comment