Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయం వెనుక భారత రాకెట్ సైన్స్ చెబుతున్న వింతలెన్నో ఉన్నాయి. శతాబ్దాల తరబడి భారత శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలను ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఇండియన్ రాకెట్ల సామర్థ్యంతో ఇంప్రెస్ అయిన బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ లోగడ వాటర్లూ వార్ లో నెపోలియన్ బోనాపార్టే పై వినియోగించుకోవడానికి ఆ టెక్నాలజీని అధ్యయనం చేసింది. త్రిపుర ఎయిర్ క్రాఫ్ట్ గురించి వైమానిక శాస్త్రంలోనే ఉంది. భారత ఖగోళ శాస్త్రం ఇప్పటిది కాదు. ఎప్పుడో వేదకాలం పూర్వమే 2500 బీసీ పీరియడ్ లో భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో కనుగొన్న విశేషాలు ఖగోళానికి సంబంధించి పలు అంశాలను ప్రపంచానికి పరిచయం చేశాయి.
ఇండస్ వ్యాలీ కల్చర్ స్క్రిప్ట్ ప్రకారం నక్షత్ర సమూహం హరప్పన్ ఆరిజిన్ కి చెందినదట . పురాతన కాలపు భారతీయులు చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని ఆనాడే మదింపు చేశారు. అలాగే గ్రహాల స్థితిగతుల పైనా.సౌర వ్యవస్థ లోని అంశాలపైనా వారు అధ్యయనం చేశారు. 1563 లో దక్కన్ సుల్తానులపై తళ్ళికోట యుద్ధ సమయంలోనే రాకెట్లు వాడారట. వీటినే బాణాలుగా అంటున్నాం.
రాకెట్ డెవలప్మెంట్ లో ఇస్రోకు చిరకాల చరిత్ర ఉంది. 1963 లో ఈ సంస్థ రోహిణి-1 రాకెట్ ను తొలిసారి ప్రయోగించింది. అప్పటి నుంచి ఇస్రో వివిధ రకాల రాకెట్లను, ఉపగ్రహాలను అభివృద్ధి చేసింది. వీటిలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ వంటివి ఉన్నాయి. 2008 లో చంద్రయాన్ ట్రై సిరీస్ ఆర్బిటర్ ను కూడా ఈ సంస్ధ అభివృద్ధి పరచింది. చంద్రయాన్-2 మిషన్ ఇస్రోకు ఓ పెద్ద విజయం, చంద్రునిపై నీరు, ఐస్ ఉన్నాయా అని జరుగుతున్న అన్వేషణలో ఇది ముందడుగు. చంద్రుని ఉపరితలంపై ఈ వ్యోమనౌక మూన్ మినరాలజీ మ్యాపర్ ను , ఆర్బిటర్ హై రిసొల్యూషన్ కెమెరాను, టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరాను, లేసర్ రేంజ్ ఫైండర్ ను ఉపయోగించుకుంటుంది.
స్వామి దయానంద సరస్వతి నాడు రాసిన రిగ్వేద భాష్య భూమిక, వేద భాష్య వంటి పలు పుస్తకాలను చదివి 1893 లో వేదిక స్కాలర్ అయిన శివ్ కార్ బాపూజీ తల్పడే ముంబైలో ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. వేద శాస్త్ర సంబంధ విజ్ఞానం పై ఆధారాపడి ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ను అభివృద్ధి పరచారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి చంద్రయాన్-3 సక్సెస్ కి నాటి శాస్త్రీయ విజ్ఞానం కూడా ఎంతో తోడ్పడిందని చెప్పక తప్పదు.