Telugu News » revanth reddy: ఉప్పు, నిప్పు అన్నట్లు ఉన్నారు..కానీ ఇప్పుడు తలుపులు మూసుకొని మాటలు!

revanth reddy: ఉప్పు, నిప్పు అన్నట్లు ఉన్నారు..కానీ ఇప్పుడు తలుపులు మూసుకొని మాటలు!

ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదు. ధరణిపై 12 వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టేందుకు సిద్దమా?, దోపిడీని ప్రశ్నిస్తే... మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును ముందు పెడుతున్నారు.

by Sai
revanth reddy

తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) కి ఏటీఎంలా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy)స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌(brs) ఏర్పాటు చేసిన ధరణిని రద్దు చేస్తామని ఆయన తెలిపారు. ధరణి అంటే కేసీఆర్‌కి అడ్డంగా దోచుకునే అడ్డా అయిపోయిందని విమర్శించారు.

revanth reddy

ఇంతకు ముందు వరకు కాళేశ్వరరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్‌ కి ఏటీఎంగా మారితే..ఇప్పుడు ధరణిని కేసీఆర్‌ ఏటీఎంగా మార్చేసుకున్నారని రేవంత్‌ ఆరోపించారు.

ఎన్ని వందల కోట్లు వచ్చాయో, ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారో లెక్కలు చూసుకుంటున్నారు. ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ధరణి తెచ్చింది 2020లో.. రైతుబంధు, రైతు బీమా మొదలు పెట్టింది 2018లో.. గతంలో రైతు రుణమాఫీ, పంట నష్టం చెల్లించిన ఘనత కాంగ్రెస్‌ది. రెవెన్యూ శాఖలో ఉన్న వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు.

ధరణి వచ్చాక 35 లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారు. కేసీఆర్ దళారీగా మారి వేల మంది వీఆర్వోల పని ఆయనే చేస్తున్నారు. కలెక్టర్లను అడ్డు పెట్టుకుని భూములు దోచుకుంటున్నారు. అంతకంటే అత్యాధునిక విధానాన్ని తీసుకు వచ్చి భూములకు రక్షణ కల్పిస్తాం. టైటిల్ గ్యారంటీ ఇచ్చి భూములకు రక్షణ కల్పిస్తాం.

ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదు. ధరణిపై 12 వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టేందుకు సిద్దమా?, దోపిడీని ప్రశ్నిస్తే… మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును ముందు పెడుతున్నారు. మరి నువ్వు అక్రమ కేసులు పెట్టిన వారు బీసీలు కాదా?.’’ అని నిలదీశారు.

‘‘ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్లు కేసీఆర్ నమ్మించారు. ఉప్పు, నిప్పు అన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఇద్దరూ రాజ్‌భవన్‌లో తలుపులు మూసి మాట్లాడుకున్నారు. మీ మధ్య ఏం రహస్యం ఉంది?, ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా?, ఇన్నాళ్లు గవర్నర్‌ను బీజేపీ అధ్యక్షురాలు అని కేసీఆర్ అన్నారు.

ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఎన్నికల పొత్తు అయినట్లా? కానట్లా? ప్రజలు ఆలోచించాలి. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ ఛోటా భాయ్.’’ అంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment