సంక్రాంతి పండుగ(Sankrathi Festival) వచ్చిందంటే చాలు గాలి పటాలను ఎగురవేస్తూ పిల్లల సందడి మామూలుగా ఉండదు. ఈ పతంగులను ఎగురవేసేందుకు ఎక్కువగా నిషేధిత చైనా మాంజా(China Manja)ను వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల కొందరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
చివరకు పక్షులూ చైనా మాంజా చుట్టుకొని విలవిల్లాడుతున్నాయి. రెండు రోజుల్లోనే ఒక్క ముంబై నగరంలో 1,000 పక్షులు మృత్యువాతపడ్డాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. ముంబై నగరవ్యాప్తంగా 25 ఫ్రీ బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాల్లో గాయపడ్డ పక్షులకు పక్షి ప్రేమికులు ప్రత్యేక చికిత్స అందించారు. దహిసర్, బోరివాలి, కందివాలి, మలాద్ ఏరియాల్లో సుమారు 500లకు పైగా పక్షులను ప్రాణాలతో రక్షించారు. కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేక పోతున్నాయి. అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచి పర్యవేక్షిస్తామని పక్షి ప్రేమికులు తెలిపారు.
చికిత్స అనంతరం కొన్ని పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. చైనా మాంజా ప్రమాదకరం దాన్ని వినియోగించొద్దని ఈ ఏడాది సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరిగిందని పక్షి కోరతున్నారు. ఈ మాంజా పక్షులకు తగలడంతో అవి ప్రాణాలు కోల్పోతున్నాయని, మనషులకు కూడా ప్రమాదకరంగా మారుతుందని ప్రచారం చేస్తున్నారు.