Telugu News » Vivek Venkata Swami: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న వివేక్ వెంకటస్వామి..!

Vivek Venkata Swami: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న వివేక్ వెంకటస్వామి..!

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Venkata Swami) అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు (US presidential election) నుంచి తప్పుకున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

by Mano
Vivek Venkata Swami: Vivek Venkataswamy dropped out of the US presidential election..!

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Venkata Swami) అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు (US presidential election) నుంచి తప్పుకున్నారు. ఈ బయోటెక్ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

Vivek Venkata Swami: Vivek Venkataswamy dropped out of the US presidential election..!

ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి తాను ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ఆపబోతున్నాను.. డొనాల్డ్ ట్రంప్‌నకు ఫోన్ చేసి ఆయన రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాను. ట్రంప్ అధ్యక్ష పదవికి నా పూర్తి మద్దతు ఉంటుంది’ చెప్పుకొచ్చారు.

ఇక, అభ్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ 51 శాతం ఓటింగ్‌తో విజయం సాధించారు. అయోవాలోని రిపబ్లికన్ కౌకస్‌లో జరిగిన ఓటింగ్‌లో రామస్వామికి కేవలం 7.7శాతం ఓటింగే వచ్చింది. నాలుగో స్థానం దక్కించుకోవడం వల్ల ఈ రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. రామస్వామి ఒకప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇమ్మిగ్రేషన్‌తో పాటు అమెరికా వంటి సమస్యలను లేవనెత్తడం ద్వారా ఆయన రిపబ్లికన్ ఓటర్లలో తన స్థానాన్ని త్వరగా నిరూపించుకోగలిగారు. గత ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించిన సంప్రదాయవాద ఓటర్లను రామస్వామి తన వైపుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో నిలుస్తున్నట్లు ప్రకటించారు.

You may also like

Leave a Comment