Telugu News » China minister: జిన్ పింగ్‌ ప్రభుత్వంలో మరో మంత్రి మిస్సింగ్‌!

China minister: జిన్ పింగ్‌ ప్రభుత్వంలో మరో మంత్రి మిస్సింగ్‌!

చైనా రక్షణమంత్రి లీ షాంగ్‌ ఫు(Lee Shang Phu) గత రెండు వారాలుగా బహిరంగంగా కనిపించకపోవడంతో..

by Sai
china minister li shangfu missing

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Jinping) ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో మంత్రి (Minister) అదృశ్యమయ్యారు. చైనా రక్షణమంత్రి లీ షాంగ్‌ ఫు(Lee Shang Phu) గత రెండు వారాలుగా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన మిస్‌ అయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తుండటం కలకలం రేపుతున్నది. దాదాపు రెండు వారాల నుంచి ఆయన కనిపించడం లేదని జపాన్‌లోని అమెరికా రాయబారి రహ్మ్‌ ఇమ్మాన్యుయేల్‌ ట్వీట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

china minister li shangfu missing

షాంగ్‌ఫూ చివరిసారిగా గత నెల 29న బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఫోరంలో కనిపించారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ హార్డ్‌వేర్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. అయితే ఈ ఏడాది జూన్ లో చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గాంగ్‌ సైతం అదృశ్యమైన విషయం తెలిసిందే. క్విన్‌ గాంగ్‌ చివరిసారిగా జూన్‌ 25న రష్యా, శ్రీలంక, వియత్నాం అధికారులతో సమావేశం సందర్భంగా కనిపించారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. అయితే ఒక లేడీ జర్నలిస్ట్ తో ఆయన స్నేహం గురించి కూడా చాలా వార్తలు వచ్చాయి.

ఇప్పటికీ ఆయన ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే,ఆయన మిస్సింగ్‌ పై జిన్ పింగ్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై చర్చించకుండా జిన్ పింగ్ సర్కార్ నిషేధాజ్ణలు విధించింది. తర్వాత, కాంగ్ స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించారు. క్విన్ గాంగ్ తర్వాత చైనా ఆర్మీలోని రాకెట్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు కూడా అదృశ్యమయ్యారు. ఆయన రాకెట్ ఫోర్స్ అణు,బాలిస్టిక్ క్షిపణుల ఆయుధగారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఐదేళ్ల క్రితం జరిగిన హార్డ్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన అవినీతి కేసులను ఆర్మీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో రక్షణ మంత్రి అదృశ్యమయ్యారనే వార్త వచ్చింది. ఈ విచారణ జులైలో ప్రారంభమైంది. అయితే, 2017 అక్టోబర్ నుంచి ఈ అక్రమాలపై విచారణ జరుపుతున్నామని చైనా మిలిటరీ చెబుతోంది. షెంగ్ఫు సెప్టెంబర్ 2017 నుండి 2022 వరకు పరికరాల విభాగానికి అధిపతిగా ఉన్నారు.

చైనా రక్షణ మంత్రి అదృశ్యమయ్యారనే వార్తల మధ్య, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సైన్యంలో ఐక్యత, స్థిరత్వం కోసం విజ్ఞప్తి చేశారు. గత శుక్రవారం దేశంలోని ఈశాన్య ప్రాంతంలో జరిపిన తనిఖీలో చైనా అధ్యక్షుడు ఈ విజ్ఞప్తి చేశారని వార్తా సంస్థ జిన్హువా ఆదివారం తన నివేదికలో పేర్కొంది.

You may also like

Leave a Comment