Telugu News » Nipah Virus: భారత్ ను భయపెడుతున్న నిపా వైరస్!

Nipah Virus: భారత్ ను భయపెడుతున్న నిపా వైరస్!

నీపా వైరస్ కారణంగా బాధితులు మరణించారన్న అనుమానాల నడుమ కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ నిన్న అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

by Prasanna
Nipha virus

కరోనా విలయం పూర్తిగా మరిచిపోకముందే నిపా వైరస్ మరో సారి దేశంలో కలకలం సృష్టిస్తోంది. నిపా వైరస్ (Nipah Virus) సోకిన లక్షణాలతో కేరళ (Kerala)లోని కోజీకోడ్ (Kozhikode) జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Nipha virus

నిపా వైరస్ కారణంగా బాధితులు మరణించారన్న అనుమానాల నడుమ కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ నిన్న అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం పేర్కొంది. మృతుల బంధువు ఒకరు అనారోగ్యం కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కూడా వెల్లడించింది. దక్షిణ భారతంలో తొలి నిపా వైరస్ కేసు  కోజీకోడ్ జిల్లాలోనే 2018లో బయటపడటం తెలిసిందే.

2018 నుంచి 2021 వరకు కేరళలో అనేక నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ భారత దేశంలో 2018 మే 9న మొదటి నిపా వైరస్ కేసు నమోదైంది. 2019లో మరికొన్ని కేసులు బయటపడ్డాయి.  2021లోనూ మెదడు వాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్ ను గుర్తించారు. 1989లో ప్రపంచంలో తొలిసారి నిపా వైరస్ ను మలేషియాలో గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా వ్యాధి బారినపడ్డ వారి సమీపంలోకి వెళితే ఇన్‌ఫెక్షన్ బారిన పడతారు. నీపా వైరస్ రోగుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మరికొందరిలో మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, ఇంకొందరు ప్రాణాంతకమైన మెదడువాపు బారినపడతారు.

You may also like

Leave a Comment