ప్రముఖ హాలీవుడ్ నటుడు(Hollywood Actor) క్రిస్టియన్ ఒలివర్ (Christian Oliver), తన ఇద్దరు కూతుళ్లతో సహా విమాన ప్రమాదం(Flight Accident)లో మృతిచెందారు. వెకేషన్లో భాగంగా ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో బెక్వియాలో టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కరీబియన్ సముద్రంలో (Caribbean Sea) కుప్పకూలింది. దీంతో 51ఏళ్ల ఒలివర్తోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత, అన్నీక్ సముద్రంలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులతో కలిసి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. క్రిస్టియన్ ఒలివర్, ఆయన కూతుళ్లతో పాటు పైలట్ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. వారి మృతదేహాలను వెలికితీశామన్నారు.
ఒలివర్.. జర్మనీలో జన్మించాడు. ‘ది గుడ్ జర్మన్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. 2008లో వచ్చిన యాక్షన్-కామెడీ చిత్రం ‘స్పీడ్ రేసర్’లో జార్జ్ క్లూనీతో కలిసి బిగ్ స్క్రీన్‌పై కనిపించాడు. తన కెరీర్ ప్రారంభంలో టీవీ షోలు చేసిన ఆయన ఇప్పటివరకు ఆయన 60కిపైగా సినిమాల్లో నటించాడు.