Telugu News » Vizag Beach: జపాన్‌లో భూకంపం.. వైజాగ్ బీచ్‌లో వింత..!

Vizag Beach: జపాన్‌లో భూకంపం.. వైజాగ్ బీచ్‌లో వింత..!

విశాఖ సముద్ర తీరం(Vizag Beach)లో వింత చోటుచేసుకుంది. శుక్రవారం సముద్ర అలలు(Sea waves) సుమారు 100మీటర్లు వెనక్కి వెల్లాయి. మూడు నాలుగు రోజులుగా సముద్ర నీటి మట్టం తగ్గుతోందని ఇక్కడి మత్స్యకారులు చెబుతున్నారు.

by Mano
Vizag Beach: Earthquake in Japan.. Strange in Vizag Beach..!

విశాఖ సముద్ర తీరం(Vizag Beach)లో వింత చోటుచేసుకుంది. శుక్రవారం సముద్ర అలలు(Sea waves) సుమారు 100మీటర్లు వెనక్కి వెల్లాయి. అయితే, ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది జపాన్‌ భూకంప(Japan Earthquake) ప్రభావమా? లేక అమావాస్య, పౌర్ణమి సమయంలో వాతావరణంలో మార్పుల ఫలితమా? అనేది తెలియాల్సివుంది.

Vizag Beach: Earthquake in Japan.. Strange in Vizag Beach..!

విశాఖలో మూడు నాలుగు రోజులుగా సముద్ర నీటి మట్టం తగ్గుతోందని ఇక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. జపాన్‌లో భూకంపం వస్తే దాని ప్రభావం ఇంతవరకు కనిపిస్తుందా..? ఇదే కారణమా లేక మరేదైనా ఉందా? అని ఊహాగానాలు మొదలయ్యాయి.

విశాఖ సముద్ర తీరానికి సందర్శకులు చాలా మంది వస్తుంటారు. సాధారణంగా అధిక ఆటుపోట్ల సమయంలో సముద్రం వెనక్కి వెళ్లం లేదా సముద్రం ఎత్తు కొద్దిగా పెరిగడం వంటికి కనిపిస్తాయి. అయితే ఈ మార్పు కాస్త అందుకు భిన్నమనే చెప్పాలి.

అయితే, విశాఖ బీచ్‌లో అలలు వెనక్కి వెళ్లాడానికి, జపాన్‌లో భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని మెట్రాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ రమేష్ అభిప్రాయపడ్డారు. సముద్రంలోని అనేక రకాల మార్పులు దాని తీరాన్ని ప్రభావితం చేస్తాయని.. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రొఫెసర్ చెప్పారు.

You may also like

Leave a Comment