తెలంగాణ (Telangana) ఇచ్చింది తామే అని కాంగ్రెస్ (Congress) నేతలు చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేసుకొంటున్న.. తెలంగాణ తెచ్చింది మేమే అన్న బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికే ఇప్పటి వరకు ప్రజలు జై కొట్టారు. ఈ నేపధ్యంలో, తెలంగాణలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కలలు కంటుండగా, అవి పీడ కలలు కావద్దని హస్తం అభిమానులు ఆశిస్తున్నారు.
మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ (BJP), బీఆర్ఎస్ లను అధికార పీఠం ఆశ పెడుతోంది. ఈ క్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా.. గృహలక్ష్మి (Grilahakshmi), బీసీ బంద్ (BC Bundh) అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections), తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హస్తం అధికారంలోకి రాగానే.. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలి అంటున్న మంత్రి కేటీఆర్.. ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర సంపదని దోచుకుంటున్న బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయ్యాలో చెప్పాలని ప్రశ్నించారు భట్టి.. మొత్తానికి ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలోని మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇలా విరుచుకుపడటం కాంగ్రెస్ అభిమానులకు ఊపునిస్తుంది.