Telugu News » Congress : మారనున్న సీఎం క్యాంప్ ఆఫీస్.. కొత్తది ఎక్కడంటే..?

Congress : మారనున్న సీఎం క్యాంప్ ఆఫీస్.. కొత్తది ఎక్కడంటే..?

పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే రెగ్యులర్‌గా జరిగే కాన్ఫరెన్సులు, లెక్చర్లు, ట్రెయినింగ్ తదితర యాక్టివిటీస్‌కు సెక్యూరిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలుస్తుంది.

by Venu
Revanth reddy fire on kcr family

తెలంగాణ (Telangana) రాష్ట్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా పలు మార్పులకు రేవంత్ శ్రీకారం చూడుతున్నారని సమాచారం.. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCR HRD) ప్రాంగణంలోకి మారనున్నట్టు తెలుస్తుంది..

Revanth reddy wrote an open letter to cm kcr

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రగతి భవన్ (Pragathi Bhavan) సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. అయితే రేవంత్ ప్రభుత్వం.. ప్రగతి భవన్ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చడంతో, సీఎం క్యాంపు కార్యాలయం మరోచోటికి షిప్ట్ చేయవలసిన అవసరం ఏర్పడింది.. దీనికి అనుగుణంగానే ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ ప్రాంగణంలో గుట్టమీద ఉన్న బ్లాక్‌లోకి మార్చే ఆలోచనలు తెరమీదకు వచ్చాయి.

ప్రస్తుతం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండడంతో, క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గర్లో ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలోకి మారుతున్నది. మరోవైపు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ భవనాన్ని ఆదివారం పరిశీలించారు. ఇక దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలో 150 మంది ఒకేసారి కూర్చునేలా నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు ఉన్నాయి.

మరోవైపు పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే రెగ్యులర్‌గా జరిగే కాన్ఫరెన్సులు, లెక్చర్లు, ట్రెయినింగ్ తదితర యాక్టివిటీస్‌కు సెక్యూరిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు..

You may also like

Leave a Comment