Telugu News » CM Jagan: లండన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

CM Jagan: లండన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

విదేశి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎంకు అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

by Prasanna
Jagan 1

సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) లండన్ (London) లో ఉన్న తన పిల్లలను కలిసేందుకు సెప్టెంబర్ 2న వెళ్లిన సంగతి తెలిసిందే. తన పర్యటన ముగించుకుని ఇవాళ  ప్రత్యేక విమానంలో గన్నవరం (Gannavaram) చేరుకున్నారు. విదేశి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎంకు అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

Jagan 1

గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు స్వాగతం పలికిన వారిలో ఎంపీ నందిగామ సురేష్, మంత్రులు జోగి రమేష్‌, విశ్వరూప్‌, ఎమ్మెల్యేలు వంశీ, విష్ణు, పార్థసారథి, కైలే అనిల్ తదితరులున్నారు. అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.

Jagan 2

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టై రిమాండ్ లో ఉండగా…ఇవాళ సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో రాజకీయంగా చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ నిన్న టీడీపీ రాష్ట్ర బంద్ కూడా నిర్వహించింది. ఈ నేపధ్యంలోనే సీఎం రాష్ట్రానికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలా ఉండగా,  ఇవాళ రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం,  చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం  నెలకొన్న ఈ తరుణంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరో వైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ సమయంలోనే లండన్ నుంచి వచ్చిన సీఎం వెంటనే ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

You may also like

Leave a Comment