Telugu News » CM KCR: విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి వుంది…..!

CM KCR: విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి వుంది…..!

ఏ మాత్రం ఏమర పాటుగా ఉన్నా కథ మొదటికి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

by Ramu
cm kcr fire on opposition parties in public meeting

ఎన్నికల (Elections) సమయంలో అనేక మైన అబద్దాలతో, అనేక మోసపు మాటలతో ఆపద మొక్కుల మొక్కుతు వచ్చే వాళ్లు చాలా మంది ఉంటారని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా (careful) ఉండాలని ఆయన తెలిపారు. ఏ మాత్రం ఏమర పాటుగా ఉన్నా కథ మొదటికి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

cm kcr fire on opposition parties in public meeting

రాజన్న సిరిసిల్ల ప్రజాశీర్వాద సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్ని సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….. తన 70 ఏండ్ల జీవితంలో కనీసం 170 సార్లు తిరిగిన జిల్లా సిరిసిల్ల అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నో బంధుత్వాలు, బాంధవ్యాలు, ఎంతో మంది సన్నిహితులు ఉన్న జిల్లా సిరిసిల్ల అని పేర్కొన్నారు. 40 ఏండ్ల క్రితం మానేరులో ఒక నీళ్ల పాయ కనిపించేందన్నారు. సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిందన్నారు. ముస్తాబాద్‌లోని గూడూర్ గ్రామంలో అప్పర్ మానేర్ కాల్వలో తాను చాలా ఏండ్లు ఈత కొట్టానన్నారు.

సమైక్య పాలనలో అప్పర్ మానేరు అడుగంటి పోయిందన్నారు. కానీ ఇప్పుడు అప్పర్ మానేరు కాల్వలో ఎండ కాలంలో కూడా మత్తడి దూకుతుంటే దాన్ని కళ్లారా చూసి ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. కళ్యాణ లక్ష్మీ మొదలు పెట్టుకున్నప్పుడు భయం ఉండేదన్నారు. మొదట 50 వేల రూపాయలతో కళ్యాణ లక్ష్మీ మొదలు పెట్టామన్నారు. ఆ తర్వాత దాన్ని రూ. 75 వేలకు పెంచామన్నారు. తర్వాత లక్షకు పెంచామన్నారు.

పింఛన్ మొదట ఒక వేయి పెట్టుకున్నామన్నారు. ఇటీవల దాన్ని ఐదు వేలకు పెంచుతామని చెప్పామన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు పంచి యావత్ తెలంగాణకు అన్నం పెడుతున్నామని చెప్పారు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు ఎక్కడ చూసినా కరువు కనిపించేదన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోందని చెప్పారు.

తమ ప్రభుత్వంలో రైతుల‌దే అధికార‌మ‌న్నారు. గతంలో సిరిసిల్లలో నేత‌న్నలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని అధికారులు గ్రామాల్లో రాతలు రాయించే వారన్నారు. వాటిని చూసి చలించి పోయానన్నారు. పార్టీ నిధులతో పాటు చందాలు జమ చేసి చేనేత కార్మికుల సాయం చేశానన్నారు. కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయ్యాక సిరిసిల్ల రూపు రేఖలే మారిపోయాయని వెల్లడించారు.

చేనేత కార్మికులకు పని కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం తీసుకు వచ్చామన్నారు. కానీ వాటిపై కొందరు రాజకీయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
బతుకమ్మ చీరలు నచ్చక పోతే తీసుకోవద్దన్నారు. అంతేకానీ బతుకమ్మ చీరలపై రాజకీయం తగదన్నారు. రేషన్ కార్డులందరికీ సూపర్ ఫైన్ రైస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

అనేకమైన అబద్దాలతో, అనేక మోసపు మాటలతో ఆపద మొక్కుల మొక్కుతు వచ్చే వాళ్లు చాలా మంది ఉంటారన్నారు. రామా రావు గుణం ఏందో తన కన్నా ప్రజలకే తెలుసన్నారు. మూడేండ్లు మేథోమధనం చేసి ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చానని చెప్పారు. ఇప్పుడు ఏ మండలం రిజిస్ట్రేషన్లు ఆ మండలంలోనే జరుగుతున్నాయని అన్నారు.

ధరణిలో ఒకటో రెండో సమస్యలు వుంటే వాటిని చటుక్కున పరిష్కరించవచ్చన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళ ఖాతంలో విసిరేస్తామంటున్నారంటూ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన సాధికారతను తీసేస్తామంటూ సిగ్గుమాలిన కాంగ్రెస్ అంటోందని తీవ్రంగా ఫైర్ అయ్యారు. ధరణి లేక పోతే ఈ దుర్మార్గులు పెట్టే చిక్కులకు ఎన్ని హత్యలు జరుగుతుండేవన్నారు.

ప్రజలు ఏ మాత్రం ఏ మర పాటుతో ఉన్నా మళ్లీ కథ మొదటికి వస్తుందన్నారు. పెద్ద పాము నోట్లో పడినట్టు అవుతుందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణ నంబర్ వన్, ఇండ్లల్లో నల్లాలు పెట్టి వంద శాతం నీళ్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ చీఫ్ తన కడుపులోని మాటను కక్కశాడన్నారు. కరెంట్ 24 గంటలు ఉండాలా మూడు గంటలు వుండాలని అన్ని ప్రశ్నించారు.

60 ఏండ్లు కాంగ్రెస్ పాలించిందన్నారు. ఎన్నడు సరిపోయేంత కరెంట్ ఇవ్వలేదన్నారు. ఇండియాలో కేవలం తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉందన్నారు. బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం అంటే తాను దానికి ఒప్పుకోలేదన్నారు. హిందువులు, ముస్లింలు అంటూ పంచాయితీలు పెట్టే దుర్మార్గులు వున్నాయని తెలిపారు. కానీ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు.

You may also like

Leave a Comment