Telugu News » CM KCR : కేసీఆర్ టూర్ వాయిదా.. ఎందుకు? ఏం జరిగింది..?

CM KCR : కేసీఆర్ టూర్ వాయిదా.. ఎందుకు? ఏం జరిగింది..?

సూర్యాపేట టూర్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

by admin
Problems of Gruhalakshmi Scheme

ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం కేసీఆర్ (CM KCR) జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అనేక సర్వేలు చేయిస్తున్న ఆయన.. ప్రజల మదిలో ఏముందో తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో జిల్లాల పర్యటనలకు వెళ్లి.. జనంలో ఊపు తీసుకు రావాలని అనుకుంటున్నారు. ప్రారంభోత్సవాలు, బహిరంగ సభల ద్వారా.. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. ఇంకోవైపు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలతో విరుచుకుపడేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ఆదిలోనే బ్రేక్ పడింది.

Problems of Gruhalakshmi Scheme

సీఎం కేసీఆర్ మెదక్ (Medak) టూర్ వాయిదా పడింది. వర్షాల కారణంగా ఈ టూర్ వాయిదా వేస్తున్నట్టుగా సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 19న కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ బీఆర్ఎస్ (BRS) ఆఫీస్ తో పాటు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా దానిని 23కు వాయిదా వేశారు. అయితే.. సూర్యాపేట టూర్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఈనెల 20న సూర్యాపేట (Suryapet) జిల్లాలో పర్యటించనున్నారు సీఎం. అక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని, మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ఓపెన్ చేసి.. అనంతరం పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు.

You may also like

Leave a Comment