Telugu News » CM Revanth : పాలమూరు పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేక పోతున్నారు.. రేవంత్ రెడ్డి..!

CM Revanth : పాలమూరు పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేక పోతున్నారు.. రేవంత్ రెడ్డి..!

గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ ఎంతమందికి డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని వివరించారు..

by Venu
CM Revanth Reddy: Can anyone kill a dead snake again?: CM Revanth Reddy

నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభ (Jana Jathara Sabha)కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్​ రెడ్డి, ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ ఓట్లన్నీ బీజేపీకు మళ్లించాలని, కేసీఆర్ వెల్లడించడం సరైనదేనా అని ప్రశ్నించారు.. అలాగే ముదిరాజ్​లను బీసీ-డీ నుంచి బీసీ- ఏ గ్రూప్​లోకి మార్చేందుకు, సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతామని తెలిపారు.

cm revanth reddy మాదిగల వర్గీకరణ జరగాల్సిందేనన్న సీఎం.. భవిష్యత్​లో మాదిగలకు మరిన్ని పదవులు ఇస్తామని పేర్కొన్నారు.. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్‌ (KCR) పదేళ్ల పాలనలో ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్‌ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని మండిపడ్డారు.. నారాయణపేట మున్సిపాలిటీకి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

పాలమూరు బిడ్డ, పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారని విమర్శించిన రేవంత్.. దొరలు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా, పేద బిడ్డలు కూర్చోవద్దా అంటూ నిలదీశారు. వందరోజులకే తనని గద్దె దించాలని అంటూన్న కేసీఆర్.. పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీని (PM Modi) గద్దె దించాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డిని ఊడగొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారని మండిపడ్డారు..

ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ (Revanth), ఎన్నికల కోడ్‌ ఉన్నందునే రుణమాఫీ చేయలేకపోయామని తెలిపారు. వచ్చేసారి వడ్లకు రూ.500 బోనస్‌ తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు కొడంగల్​ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసానో, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించానో అదేవిధంగా ఏకకాలంలో, ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాదని పేర్కొన్నారు..

గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ ఎంతమందికి డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశామని వివరించారు.. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించామని తెలిపారు. అదేవిధంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులివ్వాలనే ఉద్దేశంతో, బీసీ కులగణనకు తీర్మానం చేశామని వెల్లడించారు..

You may also like

Leave a Comment