Telugu News » CM Revanth Reddy: ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్…!

CM Revanth Reddy: ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్…!

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ (Hyderabad)లో పెరుగుతోన్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రద్దీగా ఉన్న పలు మార్గాల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్(On the underground tunnels) నిర్మించేందుకు సిద్ధమైంది.

by Mano
If you don't want reservations, vote for BJP. If you want, vote for Congress!

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ (Hyderabad)లో పెరుగుతోన్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రద్దీగా ఉన్న పలు మార్గాల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్(On the underground tunnels) నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అధికారులు ఓ నివేదికను సమర్పించారు.

CM Revanth Reddy: Government's key decision...green signal for another project...!

హైదరాబాద్‌లో దాదాపు 12 వేల కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. అయితే, రహదారులు మరీ ఇరుకుగా ఉండటంతో ఎక్కడ చూసినా నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. 30 నిమిషాల ప్రయాణానికి సైతం గమ్య స్థనాన్ని చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో ఈ సమస్యకు ‘అండర్ గ్రౌండ్ టన్నెల్స్’ నిర్మాణమే సరైన నిర్ణయమని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు.

ఈ మేరకు ఐటీసీ కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రామ్‌ గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకూ 9.5 కి.మీ మేర భారీ టన్నెల్‌ను, ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్‌టీయూ వరకూ 8 కి.మీ మేర మరో టన్నెల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా రోడ్ నెం.10 వరకు దాదాపు 6.5 కిమీ మేర టన్నెల్‌ రూపకల్పనకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

మరోవైపు జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా నానల్‌నగర్ వరకు 6 కి.మీ టన్నెల్ మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చాంద్రాయణ గుట్ట ఇన్నర్ రింగ్‌ రోడ్డు వరకూ 9 కి.మీ టెన్నెల్ నిర్మించనున్నారు. దీంతో భవిష్యత్తులో నగర వాసులకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

You may also like

Leave a Comment