తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటన రద్దయింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం 17 పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లను నియమించింది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేతలు వీరితో చర్చించేందుకు ఢిల్లీలో షెడ్యూలు ఖరారైంది.
అయితే ప్రస్తుతం రేవంత్ ఢిల్లీ (Delhi) పర్యటన రద్దయిందని అధికారిక ప్రకటన వచ్చింది. సీఎంకి బదులుగా.. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు షబ్బీర్ ఆలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు ఢిల్లీకి చేరుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి పాల్గొననున్నట్టు సమాచారం.. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కీలక నేతలతో చర్చలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు పలువురు ఇప్పటికే ఢిల్లీ చేరుకొన్నారు..
మరోవైపు పార్లమెంటు ఎన్నికలపై రేవంత్‌రెడ్డి హైకమాండ్‌కు స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పినందున ఈ మీటింగుకు హాజరుకాలేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ అధిష్టానంతో చర్చల తర్వాత సూత్రప్రాయ నిర్ణయం జరిగిందని పేర్కొన్నాయి. కానీ మరికొద్దిమంది సీనియర్ నేతలు మాత్రం షెడ్యూలు ఒక రోజు వాయిదా పడిందని, శుక్రవారం ఉండే అవకాశాలున్నట్టు వెల్లడిస్తున్నారు..