Telugu News » Lok Sabha Elections : ఒవైసీ ఓటమికి కాంగ్రెస్-బీజేపీ మైండ్ బ్లోయింగ్ స్కెచ్..!!

Lok Sabha Elections : ఒవైసీ ఓటమికి కాంగ్రెస్-బీజేపీ మైండ్ బ్లోయింగ్ స్కెచ్..!!

గులాబీతో జతకట్టిన ఒవైసీ తాను ఊహించినట్లుగానే గత ఎన్నికల్లో ఏడు స్థానాలను దక్కించుకోగలిగినప్పటికీ.. ఓటు షేరింగ్ తగ్గిపోయింది. మరోవైపు ఈ స్థానంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుండగా.. ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన అమిత్ షా సైతం ఈ స్థానంపై ఫోకస్ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

by Venu

ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్ సభ ఎలక్షన్స్‌(Lok Sabha Elections)పై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని.. గెలుపునకు అవకాశం ఉన్న స్థానాలపై కసరత్తు ప్రారంభించాయి.. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో అధికార పీఠం కైవసం చేసుకొన్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలల్లో సైతం సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటే.. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

lokhsabha-elections

బీఆర్ఎస్ (BRS) సైతం పార్లమెంట్ ఎన్నికలల్లో విజయం సాధించి ఉనికి మాయం అవకుండా కాపాడుకోవాలని కాచుక్కూర్చుంది. ఇదే సమయంలో బద్ద శత్రువులుగా భావిస్తోన్న.. కాంగ్రెస్ (Congress).. బీజేపీ (BJP) పార్లమెంట్ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. అందులో హైదరాబాద్ (Hyderabad) లోక్‌సభ స్థానం విషయంలో పట్టు బిగించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండదని భావిస్తున్న కొందరు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య లోక్ సభ ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.. మరోవైపు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై కాంగ్రెస్.. బీజేపీ గురిపెట్టడంతో రాజకీయ రంగు కొత్తగా కనిపిస్తోందంటున్నారు.. ఒకవేళ ఎంఐఎం విజయాన్ని అందుకోలేక పోతే.. ఏడు దశాబ్ధాల ఎంఐఎం చరిత్రకు ఈ స్థానంలో బ్రేక్ పడబోతున్నదా అనే చర్చ జోరందుకుంది.

గులాబీతో జతకట్టిన ఒవైసీ తాను ఊహించినట్లుగానే గత ఎన్నికల్లో ఏడు స్థానాలను దక్కించుకోగలిగినప్పటికీ.. ఓటు షేరింగ్ తగ్గిపోయింది. మరోవైపు ఈ స్థానంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుండగా.. ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన అమిత్ షా సైతం ఈ స్థానంపై ఫోకస్ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలను పసిగట్టిన ఓవైసీ తమ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్, కమలం పార్టీలు పకడ్బందీగా గురిపెడితే.. వరుసగా తొమ్మిసార్లు విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న ఎంఐఎం రికార్డ్ కి బ్రేకు పడే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు.. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంకు గెలుపు అంతా సులువు కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కాగా ఎంఐఎం నుంచి ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పోటీ పడే అవకాశాలు ఉండటంతో.. ఒవైసీని ఢీ కొట్టే నేత కోసం అగ్రనాయకత్వం జల్లెడపడుతోన్నట్టు సమాచారం..

ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్‌తో పాటు మరికొందరు నేతల పేర్లు వినిపిస్తుండగా.. బీజేపీ నుంచి భగవంత్ రావు, రాజాసింగ్, విక్రమ్ గౌడ్ పేర్లు బయటికి వస్తున్నాయి.. మొత్తానికి పాతబస్తీలో పార్లమెంట్ ఎన్నికలు ఉత్కంఠగా మారుతోన్నాయని తెలుస్తోంది..

You may also like

Leave a Comment