కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీజేపీ (BJP) తెలంగాణ చీప్ కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్నది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమని విమర్శించారు.. పూర్తిస్థాయి మెజారిటీ లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. బీఆర్ఎస్ (BRS)తో అవగాహన కుదుర్చుకొందని ఆరోపించారు.
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయని ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి.. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి కారణం.. ఆ పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలని వెల్లడించారు.. కుటుంబ పాలన కేసీఆర్ ని నిండా ముంచిందని పేర్కొన్నారు.. బీఆర్ఎస్ మీద ఉన్న అక్కసుతో ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారు తప్పితే.. ఆ పార్టీ మీద ప్రేమతో అధికారం ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు..
కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించిన బీజేపీ చీప్.. కాళేశ్వంపై విచారణ కోరుతూ.. కేంద్రానికి ఎందుకు లేఖ రాయటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జీవో తెచ్చారని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా? అన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు..
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్ అని మండిపడ్డారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివని తెలిపిన కిషన్ రెడ్డి.. దోషులకు శిక్ష పడాలని సీఎం రేవంత్ రెడ్డికి ఉంటే దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదన విషయం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.. ఒకవేళ రేవంత్ సర్కార్, సీబీఐ విచారణ కోరితే.. 48 గంటల్లో దర్యాప్తు మొదలు అయ్యేలా తాను రికమెండ్ చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు..