Telugu News » Kharge : కేసీఆర్‌, మోడీకి బుద్ధి చెప్దాం..!

Kharge : కేసీఆర్‌, మోడీకి బుద్ధి చెప్దాం..!

నెహ్రూ కాలంలో హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు వచ్చాయని తెలిపిన మల్లిఖార్జున్ ఖర్గే (Mallikharjun Kharge)..కాంగ్రెస్‌ పెట్టిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ కు ఉందని ఖర్గే తెలిపారు.

by Venu

తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. మూడు ప్రధాన పార్టీలు విరామం లేకుండా సభలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు బన్సీలాల్‌ పేటలో నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ సభకు హాజరైన మల్లికార్జున ఖర్గే.. బీఆర్ఎస్ (BRS)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR) పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని.. కేసీఆర్ ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు.

నెహ్రూ కాలంలో హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు వచ్చాయని తెలిపిన మల్లిఖార్జున్ ఖర్గే (Mallikharjun Kharge)..కాంగ్రెస్‌ పెట్టిన పరిశ్రమలను మోడీ సర్కారు అమ్ముకుంటోందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ కు ఉందని ఖర్గే తెలిపారు. చిత్త శుద్ధి లేని బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచి నిరుద్యోగులను గోస పెడుతుందని విమర్శించారు.. కేసీఆర్‌, మోడీ.. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు.

ధనవంతులకు కొమ్ముకాస్తున్న కేసీఆర్‌, మోడీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని విమర్శించిన ఖర్గే.. కేసీఆర్‌ అవినీతి తెలంగాణ నుంచి దిల్లీకి పాకిందని అన్నారు. ఆప్‌ సర్కారుతో కేసీఆర్‌ కుమ్మక్కై మద్యం స్కామ్‌లో పాలుపంచుకున్నారని ఆరోపించిన ఖర్గే.. కూతురు కోసం మోడీతో చేతులు కలిపారని అన్నారు.. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు.. 2 కోట్ల ఉద్యోగాలు.. రైతుఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ చెప్పారు.. ఇవన్నీ చేశారా? అని ఖర్గే ప్రశ్నించారు..

మరోవైపు ఓటర్లను ఉద్దేశించి డీకే శివకుమార్‌ కూడా మాట్లాడారు.. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ హయాంలో మాత్రమే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని గుర్తుచేసిన డీకే శివకుమార్‌.. కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమిష్టి నాయకత్వం ఉండటం వల్ల.. పార్టీ ఏ నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోదని డీకే శివకుమార్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందనే అబద్ధాన్ని నమ్మకండని తెలిపిన శివకుమార్‌.. హైదరాబాద్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరుని అన్నారు.. టికెట్‌ రాని నేతలకు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ఈ సందర్భంగా శివకుమార్‌ తెలిపారు..

You may also like

Leave a Comment