Telugu News » Annaram Barrage : అనుకొన్నది సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్నారం బ్యారేజీ ప్రాబ్లం సాల్వ్..!!

Annaram Barrage : అనుకొన్నది సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్నారం బ్యారేజీ ప్రాబ్లం సాల్వ్..!!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టుల తీరుపై రివ్యూ సమావేశాలు నిర్వహించింది. అనంతరం ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు.

by Venu

రాష్ట్రంలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకు అన్నారం బ్యారేజీ లో ఏర్పడిన బుంగలు తెలంగాణ (Telangana)లో కలకలం సృష్టించింది. బుంగలు ఏర్పడడం మామూలేనని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అప్పటి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఇంజనీరింగ్ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టుల తీరుపై రివ్యూ సమావేశాలు నిర్వహించింది. అనంతరం ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు. అలాగే విజిలెన్స్ అధికారులు కార్యాలయాల్లో తనిఖీలు చేసి ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన చొరవతో అన్నారం బ్యారేజీలో (Annaram Barrage) ఏర్పడిన బుంగల మరమ్మతుల పనులను నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ పూర్తి చేసింది.

పాలియూరిథిన్​ గ్రౌటింగ్​ ద్వారా 38, 42 పియర్​ల వద్ద ఏర్పడిన బుంగలను పూడ్చింది. ఇందులో భాగంగా ఆప్కాన్స్ సంస్థ ప్రత్యేకంగా హిమాచల్‌ప్రదేశ్ నుంచి హెలికాప్టర్‌లో పాలియూరిథిన్​ అనే కెమికల్ తెప్పించి, వంతెనలోని పియర్‌ల వద్ద బుంగలకు గ్రౌటింగ్ పనులను చేయించింది. రెండు పియర్స్ వద్ద ఏర్పడిన సీపేజీ మరమ్మతు పూర్తయినట్లు ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై ప్రభుత్వం విజిలైన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ సంబంధించిన ఇంజినీరింగ్ అధికారులను అధికారుల బృందం విచారించింది. పలు అంశాలకు సంబంధించిన ఫైళ్లు, హర్డ్‌డిస్క్‌లు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసినట్లు సమాచారం..

You may also like

Leave a Comment