లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) కేవలం మూడు నెలలు సమయం ఉండటంతో కాంగ్రెస్ (Congress) పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో అధికార పీఠం కైవసం చేసుకొన్న కాంగ్రెస్.. దేశంలో పునర్వైభవాన్ని సాధించుకొనే దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ లోని కీలక నేతలు దృష్టి సారించి లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తోన్నట్టు అర్థం అవుతోందనే వార్తలు వినిపిస్తోన్నాయి.
మరోవైపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్ (Nagpur)లో మెగా ర్యాలీ నిర్వహించడానికి హస్తం సిద్దం అవుతోంది. డిసెంబర్ 28న జరిగే ఈ మెగా ర్యాలీకి సుమారుగా 10 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతోన్నట్టు సమాచారం.. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ (Sonia Gandhi).. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ ఈ మెగా ర్యాలీలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
నాగ్పూర్ ర్యాలీ లోక్సభఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదపడుతోందని కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తోన్నట్టు తెలుస్తోంది.. అదీగాక డిసెంబర్ 28 కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ రోజు నుంచి పార్టీ 2024 లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించనుంది.. మరోవైపు మహారాష్ట్ర లో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ ఆశలు మహారాష్ట్ర పై ఉన్నాయి.