Telugu News » Congress Income Tax Case: పార్టీలపై బలవంతపు చర్యలు ఉండవు: ఐటీ శాఖ

Congress Income Tax Case: పార్టీలపై బలవంతపు చర్యలు ఉండవు: ఐటీ శాఖ

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. రూ.3500కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులను ఐటీశాఖ పంపించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.

by Mano

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. రూ.3500కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులను ఐటీశాఖ పంపించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.

Congress Income Tax Case: No coercive action against parties: IT Dept

ఐటీ శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.3500 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులపై కాంగ్రెస్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనుకోవడంలేదని వెల్లడించింది.

తుషార్‌ మెహతా వాదనలను జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మానం రికార్డు చేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది. ఐటీ శాఖ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి స్వాగతించారు. వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.3500 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని మార్చిలో తమకు నోటీసులు అందాయని వెల్లడించారు.

2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని గత శుక్రవారం నోటీసులు పంపింది. అనంతరం 2014-15 నుంచి 2016-17 మదింపు సంవత్సరాలకు సంబంధించి మరో రూ.1744 కోట్లు కట్టాలని నోటీసులు జారీ చేసింది. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ రూ.3,567 కోట్లు ఐటీ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయపుపన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను రికవరీ చేశారు.

You may also like

Leave a Comment