తెలంగాణ (Telangana)లో మరోసారి ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయం (Elections Time) దగ్గర పడుతున్న టైంలో కాంగ్రెస్ నేతల (Congress Leaders) ఇళ్లపై , ఆఫీసుల పై ఐటీ రైడ్స్ జరగడం దేనికి సంకేతం అనే ప్రశ్న జనంలో మెదులుతుందని అంటున్నారు. అధికార పార్టీ (BRS) నేతలను, బీజేపీ (BJP)నేతలను వదిలిపెట్టి కేవలం కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేయడం వెనక ఉన్న వ్యూహం ఏంటీ? అనే చర్చ జోరుగా సాగుతుంది.
మరోవైపు ఐటీ దాడుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్‌ఆర్ ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు నిన్న తుమ్మల, నేడు మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడుల జరగడం కుట్రపూరితం అని మండిపడ్డారు.
ఈ అంశంపై గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని అన్నారు. కాంగ్రెస్ సునామీలో కమలం, కారు నవంబర్ 30న గల్లంతవడం ఖాయం అని ట్వీట్ చేశారు.. మరోవైపు కాంగ్రెస్ గెలుస్తుందనే సమాచారం రావడంతో కేడీ.. మోడీ ఆగం ఆగం అవుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.. కాంగ్రెస్ సునామీ ఆపడానికి చేస్తోన్న కుతంత్రంలో చివరికి విజయం హస్తాన్ని వరిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.