Telugu News » Congress Leaders meet Governor: ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానించండి.. గవర్నర్‌కు వినతి..!

Congress Leaders meet Governor: ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానించండి.. గవర్నర్‌కు వినతి..!

గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)ని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రాజ్‌ భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు(Congress Leaders) రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు తెలియజేస్తూ గవర్నర్‌కు లేఖను సమర్పించారు.

by Mano
Congress Leaders meet Governor: Invite the formation of the government.. Request to the Governor..!

రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు తమ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)ని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రాజ్‌ భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు(Congress Leaders) రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు తెలియజేస్తూ గవర్నర్‌కు లేఖను సమర్పించారు.

Congress Leaders meet Governor: Invite the formation of the government.. Request to the Governor..!

మరోవైపు రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రమాణస్వీకారోత్సానికి ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులకు, అధికారులను పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నారు. పెద్దఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకనుగుణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవీగుప్తా, ఉన్నతాధికారులు పరిశీలించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్, అంజనీకుమార్, వసంతకుమార్, కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రేవంత్ సీఎంగా తన పేరు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్ ఠాగూర్, కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

అలాగే, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూడా సమావేశమై సీఎంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అలాగే, ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులకు ఆహ్వాహానాలు పంపించారు. ఇక, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పలికారు.

You may also like

Leave a Comment