కర్ణాటక (Karnataka) ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పాయని అంతా భావిస్తున్నారు. కర్ణాట ఎన్నికల వరకు తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పరిస్థితి అనుమానంగా ఉండేది. ఒకదశలో ఆ పార్టీ నేతలు కూడా నిరాశలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఎన్నికల రేసులో, కారుతో పాటుగా సమానంగా పరిగెత్తుతుందని భావించిన హస్తం నేతలు, కార్యకర్తలు, రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.
ఈ ఎన్నికల్లో విజయం ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ (Congress) నేతలు నామ్ కే వాస్తేగా ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నారు. లోకల్ కేడర్ సైతం సబ్ ఠీక్ హై అంటూ ప్రచార జోరును తగ్గించుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారా తీరుపై ఆరా తీసిన హైకమాండ్.. ఈ విషయాలు గమనించినట్టు నేతల దృష్టికి వచ్చింది.
దాదాపు 30 సెగ్మెంట్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) నేతలు గ్రహించారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కీలక సమయంలో నేతలు రిలాక్స్ కావడం పార్టీకి చేటు చేస్తుందని వారికి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఆల్ ఈజ్ వెల్ అనే ధోరణి మంచిది కాదని అధిష్టానం హెచ్చరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పద్ధతి మార్చుకోకుంటే పరిస్థితి చేయి జారిపోతుందంటూ.. రాహుల్, ప్రియాంక గాంధీ టూర్ తర్వాత గెలుపును ఎవ్వరూ ఆపలేరనే అతి విశ్వాసం మంచిది కాదని పీసీసీ (PCC) నేతలు హెచ్చరించినట్టు పార్టీ వర్గాల సమాచారం..
ఇప్పటికే పలు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ (BRS)..కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. కొన్ని చోట్ల ముక్కోణపు పోటీ కూడా ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఓవర్ కాన్ఫిడెన్సు పార్టీని ముంచే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఆ నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, సీరియస్‌గా ప్రచారం చేయకపోతే దెబ్బతినడం ఖాయమని భావించిన హైకమాండ్.. ఎన్నికలు ముగిసే వరకు చురుకుగా వ్యవహరించాలని వెల్లడించి.. పోల్ మేనేజ్ మెంట్ ప్లాన్ పై కూడా సూచనలు చేసిందని తెలుస్తుంది.