ఉత్తరప్రదేశ్(UP)లోని రెండు స్థానాల బరిలో గాంధీ వారసులే బరిలో ఉంటారనే ఊహగానాలకు తెరదించుతూ ఏఐసీసీ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. అయోధ్య బాల రాముని దర్శనానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi), సోదరి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27వ తేదీన వారు బాలరాముని దర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయోధ్య(Ayodhya) బాల రాముని దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గాంధీ కుటుంబానికి పెట్టింది పేరుగా ఉన్న అమేథి, రాయ్ బరేలి నియోజకవర్గం పేరుగాంచింది. ఈమేరకు అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ లోక్‌సభ స్థనాల్లో పోటీకి సిద్ధమైనట్లు సమాచారం.
2004 నుంచి మూడు సార్లు అమేథి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినథ్యం వహించిన రాహుల్ గాంధీ మరోసారి అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2019 లో బీజేపీ మహిళా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓటమిని చవిచూశారు. 2004 నుంచి రాయ్ బరేలి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన సోనియాగాంధీ అనారోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారు.
సోనియా గాంధీ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రియాంకా గాంధీ రాయ్ బరేలి నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్ బరేలి నియోజక వర్గాలకు మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 3వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. రాహుల్, ప్రియాంక మే 1 లేదా మే2న నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.