Telugu News » MP Bharat Ram: ‘అవినీతి చేస్తే నిరూపించండి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..’!!

MP Bharat Ram: ‘అవినీతి చేస్తే నిరూపించండి.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..’!!

తనపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) వాటిని నిరూపించాలని ఎంపీ మార్గాని భరత్‌రామ్(MP Margani Bharat Ram) డిమాండ్ చేశారు.

by Mano
CP Avinash Mahanty: CP is serious about the incident of dragging an APVP worker by the hair.. Important orders..!

తనపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) వాటిని నిరూపించాలని ఎంపీ మార్గాని భరత్‌రామ్(MP Margani Bharat Ram) డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు విమర్శలు చేసే ముందు ఆలోచన చేయాలని సూచించారు.

CP Avinash Mahanty: CP is serious about the incident of dragging an APVP worker by the hair.. Important orders..!

తాను పార్లమెంట్‌లో లేవనెత్తిన ఎక్కువ అంశాలు ఎవరూ ప్రస్తావించలేదని ఎంపీ భరత్‌రామ్ చెప్పుకొచ్చారు. ఆవ భూముల్లో రూ.150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో పదిహేను శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు చేయడం కాదని.. వాటిని నిరూపించాలంటూ సవాల్ విసిరారు.

పోలవరం ప్రాజెక్టు విషయమై చర్చించడానికి టీడీపీ నేతలు ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్నారు. సెంట్రల్ జైల్లో ఉండగా చంద్రబాబు కిటికీలోనుంచి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఉంటారని విమర్శించారు. పుష్కరాల్లో రెండు వేల కోట్లు తినేసింది చంద్రబాబేనని ఆరోపించారు.

అదేవిధంగా బెజవాడలో సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ ప్లెక్సీకి పోటీగా పవన్ కల్యాణ్ మేం కూడా సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఎద్దేవా చేశారు. ‘పవన్ సిద్ధమవుతుంది నాలుగో పెళ్లికా?’ అంటూ సెటైర్లు విసిరారు. అదేవిధంగా, రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం పంతులు పార్‌్ేను ఎన్టీఆర్ పార్క్‌గా మార్చేశారని, ఇంత దుర్మార్గం మరొకటి లేదని దుయ్యబట్టారు.

ఈ పార్క్‌ తిరిగి ప్రకాశం పంతులు పార్క్‌గా మార్పు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కోరతామని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తీరని అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టింది, పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబేనని ధ్వజమెత్తారు.

You may also like

Leave a Comment