కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. (cpi narayana) ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ చేతులలో నుండి రాష్ట్రాన్ని కాపాడాలని సీపీఐ ప్రయత్నం చేస్తుందన్నారు.
క్రిమినల్ ఆలోచనలు ఉన్న అమిత్ షా (amith shah) వల్లే మణిపూర్ (manipur) లాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్ లాంటి అల్లర్లను అడ్డుపెట్టుకొని మతం చాటున అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.
బీజేపీ (bjp) దేశంలో అల్లర్లకు, మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసిందన్నారు. నిన్న మొన్నటి వరకు మోడీపై మొరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ కేంద్రానికి లొంగిపోయాడని ఆరోపించారు. ఇక సీఎం కేసీఆర్ తన కూతుర్ని లిక్కర్ స్కామ్ నుండి బయటపడేసేందుకు బీజేపీకి తొత్తుగా మారాడని విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్.. కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. బెయిల్పై బయట ఉన్నారని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదని చెప్పారు.