Telugu News » bhumana karunakar reddy: భయపడే వాడిని కాదు: భూమన కరుణాకర్ రెడ్డి!

bhumana karunakar reddy: భయపడే వాడిని కాదు: భూమన కరుణాకర్ రెడ్డి!

పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని ఇలాంటి వాటికి భయపడనని ఉద్ఘాటించారు

by Sai
ttd chairman bhuman karunakar reddy comments on criticism against him

తిరుమల తిరుపతి దేవస్థానం (ttd) పాలక మండలి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి (bhumana karunakar reddy) నియామకంపై పలువురు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విమర్శలకు తిరుపతి ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. నేను విమర్శలకు భయపడేవాడిని కాదని అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు.

ttd chairman bhuman karunakar reddy comments on criticism against him

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను విమర్శలకు భయపడేవాడిని కాదని, 17 ఏళ్ల కిందటే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఆలోచన నాదేనని స్పష్టం చేశారు. దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని చెప్పారు. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తానే తీసుకున్నట్టు వివరించారు.

అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ తానేనని, దళితవాడలకు శ్రీవారి తీసుకుని వెళ్లి కళ్యాణం చేయించింది నేనే అని గుర్తుచేశారు. నా మీద క్రిస్టియన్ అని.. నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని పేర్కొన్నారు.

పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని ఇలాంటి వాటికి భయపడనని ఉద్ఘాటించారు. 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే.. సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామ‌న్నారు.

ఎందరో పాలక మండలి అధ్యక్ష్యులు, కార్యనిర్వహణాధికారులు, అధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి, విశ్వాసంతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింద‌న్నారు.

You may also like

Leave a Comment