సీపీఐ (CPI)జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీ (BJP) బీఆర్ఎస్ (BRS) వైఎస్సార్సీపీ (YSRCP)పై కీలక వ్యాఖ్యలు చేశారు.. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేసి, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని నారాయణ (Narayana) ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ, వైఎస్సార్సీపీ ఒకే గూటి పక్షులని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీతో తెరవెనక రాజకీయం చేస్తుందని నారాయణ అన్నారు..
ఏపీలో బీజేపీ తొత్తుగా వైసీపీ ఉన్నందునే జగన్, అవినాశ్ బయట తిరుగుతున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం అధికారంలో ఉన్న పార్టీలకు అలవాటుగా మారిపోయిందంటూ మండిపడ్డారు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సంతోషమని తెలిపారు.
జగన్ (Jagan) ప్రభుత్వం పై మండిపడ్డ నారాయణ.. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట ఉన్నారని.. బయట ఉండాల్సిన వారు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ (Kejriwal)ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మాట్లాడిన నారాయణ.. తాము అడిగిన బెల్లంపల్లి స్థానానికి బదులు చెన్నూరు ఇస్తామన్నారని తెలిపారు. మరోవైపు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కొత్తగూడెం చెన్నూర్ ఇస్తాం అని తెలిపినట్టు వెల్లడించారు.