Telugu News » CPI Narayana : బీజేపీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి వస్తే జరిగేది ఇదే..!

CPI Narayana : బీజేపీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి వస్తే జరిగేది ఇదే..!

బీజేపీపై నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ మిత్రులు అదానీ, అంబానీల సంక్షేమం కోసం.. దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టి పార్టీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. అయోధ్య రాముడి పేరుతో బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఫైర్ అయ్యారు.

by Venu
CPI Narayana: What happened to Chandrababu will happen to KCR: CPI Narayana

సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి (National Secretary) నారాయణ (Narayana) మరోసారి బీజేపీ (BJP)పై విమర్శలు గుప్పించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు శత్రువులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిలో ప్రథమంగా బీజేపీ, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని విమర్శించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక.. అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తాయంటే చాలు కేంద్రానికి రాష్ట్రాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

మరోవైపు బీజేపీపై నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ మిత్రులు అదానీ, అంబానీల సంక్షేమం కోసం.. దేశ సంక్షేమాన్ని పక్కన పెట్టి పార్టీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. అయోధ్య రాముడి పేరుతో బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. దేశ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని నారాయణ ఆరోపించారు.

You may also like

Leave a Comment