Telugu News » Cyber Fraud: ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.16 లక్షలు టోకరా..!

Cyber Fraud: ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.16 లక్షలు టోకరా..!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.16లక్షలు కాజేశారు. ఫేస్ బుక్‌లో యాడ్ చూసిన సదరు వ్యక్తి ఆ లింక్ ఓపెన్ చేశాడు.

by Mano
Cyber ​​Fraud: Huge fraud in the name of trading.. Rs. 16 lakhs lost..!

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక లాభాలు ఆశజూపి సామాన్యులకు ఎరవేస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. అది నిజమే అనుకొని అమాయకులు మోసపోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్నాక లబోదిబోమని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అమీన్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి రూ.33 లక్షలు పోగొట్టుకున్న ఘటన మరువకముందే మరోఘటన కలకలం రేపింది.

Cyber ​​Fraud: Huge fraud in the name of trading.. Rs. 16 lakhs lost..!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.16లక్షలు కాజేశారు. ఫేస్ బుక్‌లో యాడ్ చూసిన సదరు వ్యక్తి ఆ లింక్ ఓపెన్ చేశాడు. అందులో సైబర్ చీటర్స్ సృష్టించిన నకిలీ ట్రేడింగ్ యాప్‌లో విడతల వారీగా బాధితుడు రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. అయితే.. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించాడు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల ఇదే తరహాలో రూ.33లక్షలు కాజేశారు కేటుగాళ్లు. నకిలీ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తి రూ.33 లక్షలు పోగొట్టుకోగా బాధితుడు హైదరాబాద్ అమీన్ పూర్ పోలీసులను ఆశ్రయించాడు. అమీన్‌పూర్ పరిధిలోని పీజేఆర్ ఎంక్లేవ్‌కు చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తున్నాడు. సదరు వ్యక్తికి డిసెంబర్ 21 తేదీన ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో అకౌంట్ తెరవడం కోసం తన వ్యక్తిగత వివరాలను యాప్‌లో నమోదు చేశాడు.

దీంతో సైబర్ నేరగాడు ఒక ఐడీని క్రియేట్ చేసి ఇచ్చాడు. దీంతో ఈ వ్యక్తి నగదును ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు. కొన్ని రోజులుగా కమిషన్ చూపిస్తూ వచ్చి తన వద్ద ఉన్న మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేయాలని, అలా చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆ అపరిచితుడి మాటలు నమ్మిన బాధితుడు తన వద్ద ఉన్న మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసి కమిషన్ ఎక్కడ అని నిలదీశాడు. నిందితుడు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

You may also like

Leave a Comment