Telugu News » Dasoju Sravan : కాంగ్రెస్ ప్రోగ్రాం.. అట్టర్ ఫ్లాప్ షో

Dasoju Sravan : కాంగ్రెస్ ప్రోగ్రాం.. అట్టర్ ఫ్లాప్ షో

ప్రజాకోర్టు అట్టర్ ప్లాప్ షో.. కొండంత రాగం తీసి రేవంత్ పాట పాడినట్లుంది.. బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించారని ఎద్దేవ చేశారు.

by admin
dasoju Sravan

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ (BRS) సర్కార్ వైఫల్యాలపై ప్రజా కోర్టుకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో ప్రజాకోర్టును నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ తాజాగా నిర్ణయించింది. నెల రోజుల పాటు 12 వేల గ్రామాలు, 3 వేల డివిజన్లలో ప్రజాకోర్టులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా.. శనివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) స్పందించారు.

dasoju Sravan satires on Congress Praja Court

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై రేవంత్ (Revanth) కాంగ్రెస్ కు నమ్మకం పోయిందా? అని అడిగారు. ప్రజాకోర్టు అట్టర్ ప్లాప్ షో అని.. కొండంత రాగం తీసి రేవంత్ పాట పాడినట్లుందన్నారు. బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించారని ఎద్దేవ చేశారు. తిరగబడటం.. తరిమికొట్టడం అనేది ప్రజాస్వామిక సిద్ధాంతమా? లేక తెలంగాణ నయా నయీమ్ రేవంత్ తీవ్రవాదమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ కాంగ్రెస్ ఓట్ల పోరాటంలో ఉందా? లేక తూటాల పోరాటంలో ఉందా? అని నిలదీశారు శ్రవణ్. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లు వెయ్యరని పార్టీ ముందే చేతులెత్తేసిందా? అంటూ విమర్శించారు. ప్రజలు లేని ఖాళీ కుర్చీల ప్రజాకోర్టు ఆసాంతం కేసీఆర్ పై అక్కసుతో కడుపు మంటలు, కక్కుర్తి అరుపులు, ఊపిరితిత్తులు పగిలేలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైన ఆరోపణలు తప్ప ఏమీ లేదని సెటైర్లు వేశారు శ్రవణ్.

ప్రజా కోర్టులో ఏం జరిగింది..?

బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో శనివారం టీపీసీసీ ప్రచార కమిటీ ప్రజా కోర్టును ప్రారంభించింది. ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య న్యాయమూర్తిగా నిర్వహించారు. బీసీ సంక్షేమంలో వైఫల్యాలపై మహేష్‌ కుమార్‌ గౌడ్‌, దళిత సంక్షేమంపై మల్లు రవి, మైనారిటీ అంశాలపై షబ్బీర్‌ అలీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వంశీచంద్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ పై రాజయ్య, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గిరిజన సంక్షేమంపై బలరాం నాయక్‌ లు ఛార్జిషీట్లను సమర్పించారు. న్యాయమూర్తి పాత్రలో వారి వాదనలు విన్న కంచె ఐలయ్య.. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం దిగిపోవడమే పరిష్కారం అంటూ తీర్పును ఇచ్చారు. మున్ముందు ఇదే తరహా ప్రజాకోర్టులను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, డివిజన్లలోనూ నిర్వహించనుంది కాంగ్రెస్.

You may also like

Leave a Comment