Telugu News » Hawaii fire : పచ్చని ద్వీపంలో కార్చిచ్చు…భారీగా మృతులు!!

Hawaii fire : పచ్చని ద్వీపంలో కార్చిచ్చు…భారీగా మృతులు!!

వందల యేళ్ల చరిత్రను చూసి ప్రకృతికి కన్నుకుట్టుంది. అమెరికా (America)లోని హవాయి ద్వీప సమాహంలోని మావీయ్ దీవి(Mavaiya island)ని కార్చిచ్చు కమ్మేసింది.

by sai krishna

వందల యేళ్ల చరిత్రను చూసి ప్రకృతికి కన్నుకుట్టుంది. అమెరికా (America)లోని హవాయి ద్వీప సమాహంలోని మావీయ్ దీవి(Mavaiya island)ని కార్చిచ్చు కమ్మేసింది.అంతకంతకూ ఎగసిపడుతున్న అగ్నికీలలు…ఇప్పటి దాకా 93 మందిని మింగేశాయి.

మరి కొంత మందిని మసి చేసేందుకు అంగలారుస్తున్నాయి. కార్చిచ్చులో పడి లోహాలు సైతం లావాలా మారిపోతున్నాయి.కోట్ల రూపాయల ఆస్తి కాలి బూడిదైపోయింది.అయితే ఈ నేపథ్యంలో చనిపోయిన వారికి సంబంధించి ఇప్పటి వరకూ ఇద్దర్ని మాత్రమే అధికారులు గుర్తించారు.

మిగతా వారిని కనుగొనేందుకు ప్రభుత్వ సహాయ బృందాలు DNA పరీక్షలు(DNA Tests)నిర్వహిస్తున్నారు.పోలీస్ మృత శరీరాలను గుర్తించేందుకు జాగిలాలతో అణువణవు గాలిస్తున్నారు.గవర్నర్ జోష్‌ గ్రీన్(Governor Josh Green)మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. టిగా అధికారులు తనిఖీ చేస్తున్నారని తెలిపారువాహనాలు, ఇళ్లు చాలా వరకు బూడిదయ్యాయని.. వాటిని ఒక్కొక్క.

ప్రాథమికంగా తనిఖీ చేసిన వాహనాలు, ఇళ్లకు “ఎక్స్” గుర్తును వేస్తున్నారు. దాదాపు 50 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కార్చిచ్చు చెలరేగిన సమయంలో అధికారులు ప్రజల సెల్‌ఫోన్లకు హెచ్చరిక సందేశం పంపారని, ఇతర మాధ్యమాల ద్వారా కూడా విషయాన్ని చేరవేసినప్పటికీ అది అందరికీ చేరలేదని తెలుస్తోంది.

You may also like

Leave a Comment