Telugu News » David Warner Retirement: స్టార్ క్రికెటర్ సం‍చలన నిర్ణయం… వన్డేలకు గుడ్‌బై..!

David Warner Retirement: స్టార్ క్రికెటర్ సం‍చలన నిర్ణయం… వన్డేలకు గుడ్‌బై..!

ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమైన వార్నర్.. వన్డే క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలుపొందిన తరుణమే తన ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు.

by Mano
David Warner Retirement: The star cricketer's decision to move... Goodbye to ODIs...!

ఆస్ట్రేలియా(AUS) సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(David Warner) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమైన వార్నర్.. వన్డే క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలుపొందిన తరుణమే తన ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు.

David Warner Retirement: The star cricketer's decision to move... Goodbye to ODIs...!

తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని వార్నర్ తెలిపాడు. అయితే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను అందుబాటులో ఉంటానని దేవ్ భాయ్ తెలిపాడు. సిడ్నీ గ్రౌండ్‌లో సోమవారం డేవిడ్ వార్నర్ మీడియాతో మాట్లాడాడు. ‘నేను వన్డే క్రికెట్ నుంచీ రిటైర్ అవుతున్నా. వన్డే ప్రపంచకప్ గెలవడం, అందులోనూ భారత్‌లో గెలుపొందడం ఓ భారీ విజయంగా భావిస్తున్నా.’ అని తెలిపారు.

అదేవిధంగా ‘ఈ తరుణమే వన్డేలకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నా. నా నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయి. టెస్టు, వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని తెలుసు. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరం అయితే అందుబాటులో ఉంటా’ అని వార్నర్ తెలిపాడు.

ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరిది. వార్నర్.. 2009 జనవరి 18న హోబర్ట్ దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరఫున వన్డే అరంగేట్రం చేసాడు. చివరి వన్డే మ్యాచ్ 2023 నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో ఆడాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్.. 6,932 పరుగులు చేశాడు. 2015, 2023లో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ విజయాల్లో వార్నర్ భాగస్వామ్యం అయ్యాడు. 2015లో 345, 2019లో 647పరుగులు చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు.

You may also like

Leave a Comment