Telugu News » DD News : విమర్శలకు దారి తీసిన దూరదర్శన్ లోగో కలర్ మార్పు..!

DD News : విమర్శలకు దారి తీసిన దూరదర్శన్ లోగో కలర్ మార్పు..!

స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కాషాయ రంగులోకి మార్చడం సరి కాదన్నారు.. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు..

by Venu

ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగోను.. తాజాగా కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.. కాగా నిన్న లోగో కలర్ మారుస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. ఈ క్రమంలో దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, డీడీ న్యూస్ మాజీ సీఈవో జవహర్ సిర్కార్ స్పందించారు. ఈ చర్యను తప్పుపట్టారు.

స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కాషాయ రంగులోకి మార్చడం సరి కాదన్నారు.. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.. సరిగ్గా ఎన్నికల సమయంలో కలర్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రస్తుత సీఈవో తీరును తప్పుపట్టిన జవహర్.. ఇది ప్రసార భారతి కాదని.. ప్రచార భారతి అని సోషల్ మీడియా (Social Media) వేదికగా విమర్శించారు.

ఈ చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు.. ఇక సిర్కార్ 2012 నుంచి 2016 వరకు దూరదర్శన్ (Doordarshan).. ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా పని చేశారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆధ్వర్యంలో డీడీ న్యూస్ నడుస్తుంది. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపిన ఈ చానల్.. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది.

మాకు ధైర్యం ఉంది.. వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని ఓ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త లోగో (Logo)ను సోషల్ వీడియో వేదికగా పంచుకొంది. ఇక అన్ని భాషలలో ప్రచారాలు నిర్వహిస్తున్న డీడీ న్యూస్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. ప్రస్తుతం 6 జాతీయ ఛానెల్‌లు, 17 ప్రాంతీయ ఛానెల్‌లను కలిగి ఉంది.

You may also like

Leave a Comment