మీరు ఆర్డర్ చేసిన బిర్యానీ ఆబగా తింటున్నారా.. ఆగండి.! తినే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.!ఎందుకంటే ఒక్కోసారి చికెన్ కాకుండా ఎలుకలు,బల్లులూ రావచ్చు..!
అయ్యయ్యో వాంతి చేసుకోవద్దు..తినేముందు చెక్ చేసుకోవడం మన ఆరోగ్యానికి మంచిందని చెబుతున్నామంతే?! ఎందుకంటే…ముంబై(Mumbai) బాంద్రా(Bandra)లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డరివ్వగా వండేవాడికి కనిపించని ఎలుక తినేవాడికి కనిపించింది.!
దీంతో కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఎలుక బిర్యానీ విషయానికి వస్తే… బాంద్రా వెస్ట్ లోని పాలిహిల్(Palihill)లో భోజనం చేసేందుకు ఫ్రెండ్‌తో కలిసి అనురాగ్ సింగ్ వెళ్లాడు.
వారు చికెన్, బ్రెడ్‌తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. తమకు సప్లై చేసిన ఫుడ్‌ను తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో అందులో చిన్న ఎలుక కనిపించింది.దీంతో రెస్టారెంట్ మేనేజర్‌ను వారు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు.
మేనేజర్ తీరుపై ఆగ్రహంతో వారు బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్ వివియన్ అల్బర్ట్(Chef Vivian Albert)శికవర్, చికెన్ సప్లయర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.