Telugu News » Kohli Counter : నేను చదువుతూ పెరిగిన పేపర్ కూడా ఫేక్ న్యూస్ రాస్తోందిగా..!

Kohli Counter : నేను చదువుతూ పెరిగిన పేపర్ కూడా ఫేక్ న్యూస్ రాస్తోందిగా..!

విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పే వ్యక్తి. ఇటీవల తనపై సోషల్ మీడియా(Social media)లో ఒకఫేక్ న్యూస్ చెలామణీ అయ్యింది.

by sai krishna

విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పే వ్యక్తి. ఇటీవల తనపై సోషల్ మీడియా(Social media)లో ఒకఫేక్ న్యూస్ చెలామణీ అయ్యింది.

అతను ఒక్కో ఇనిష్టా పోస్ట్ కి రూ.11.45 కోట్లు తీసుకుంటాడని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీస్ లిస్ట్ లోని మొదటి 10 మందిలో విరాట్ ఒకడని వార్తలు గుప్పుమన్నాయి.అయితే ఈ ఫేక్ న్యూస్ కి కోహ్లీ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చాడు.


అదంతా అవాస్తవమని తేల్చేశాడు. తాజాగా మరో ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మహారాష్ట్ర అలీబాగ్‌ (Alibagh)లో ఉన్న వారి ఫామ్‌హౌస్‌లో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నారు.

నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు మొదలైనట్లు తెలుస్తోందంటూ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ది టైమ్స్ అఫ్ ఇండియా (The Times Of India) రాసింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తేలింది.

తాజాగా దీనిపై విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించాడు. చిన్నప్పటి నుంచి నేను చదివే న్యూస్ పేపర్ (TOI) కూడా ఫేక్ న్యూస్ రాయడం స్టార్ట్ చేసిందిగా అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకోచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది.

You may also like

Leave a Comment