Telugu News » Olx cheating : పాత కుర్చీలు కొంటామంటూ ..లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..!

Olx cheating : పాత కుర్చీలు కొంటామంటూ ..లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..!

జరిగేదాకా అది మోసమని తెలీదు. జరిగిన తర్వాత తెలియాల్సిన అవసరం లేదు. మాటలు హుందాగా, తీయగా,హాయిగా ఉంటాయి.

by sai krishna

జరిగేదాకా అది మోసమని తెలీదు. జరిగిన తర్వాత తెలియాల్సిన అవసరం లేదు. మాటలు హుందాగా, తీయగా,హాయిగా ఉంటాయి. తర్వాతే అది మాయని తెలుస్తుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎంతో మంది చిక్కుకుంటున్నారు.

అయితే ఈ సారి ఓ డాక్టర్ని బురిడీకొట్టించారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) .నిమ్స్‌ లో పనిచేస్తున్న ఒక వైద్యుడికి ఓఎల్ఎక్స్‌ లో ఎలక్ట్రిక్ కుర్చీ కొంటామంటూ నిమ్స్ డాక్టర్ కి టోకరా ఇచ్చారు కేటుగాళ్లు.ఏకంగా లక్షల రూపాయలు లాగేశారు.

వివరాల్లోకి వెళితే…పంజాగుట్ట(Panjagutta)నిమ్స్(NIMS) లో సీనియర్ రెసిడెంట్‌గా పని చేస్తున్న వైద్యుడు ఓఎల్ఎక్స్ ఎలక్ట్రిక్ కుర్చీ(Electric chair) అమ్మకానికి పెట్టాడు. అంతే జితేంద్ర శర్మ పేరుతో వైద్యుడికి ఫోన్ వచ్చింది.


తనను తాను జితేంద్ర శర్మ(Jitendra Sharma) పేరుతో పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు తనకు కూకట్‌ పల్లిలో ఫర్నిచర్ దుకాణం ఉందని నమ్మబలికాడు.అనంతరం కుర్చీ కొనుగోలు చేస్తా అని చెప్పి డబ్బు పంపేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పాడు.

నమ్మిన వైద్యుడు అలాగే చేశాడు.దీంతో వైద్యుడి ఖాతా నుంచి రూ.2.58 లక్షలు సైబర్ నేరగాడు కొట్టేశాడు. మోసపోయానని గ్రహించిన వైద్యుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

కొంతకాలంగా ఓఎల్ఎక్స్ లో వస్తువులు కొంటామంటూ వస్తున్న వ్యక్తులని నమ్మొద్దని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నా జనాలు మాత్రం పాటించడం లేదు. గతంలో అనేకసార్లు ఓఎల్ఎక్స్ లో అనేక ఐటమ్స్ విషయంలో చాలామంది మోసపోయారు.

ఓఎల్ఎక్స్ విషయంలో ఎవరికీ స్కానర్స్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఓటీపీలు కానీ చెప్పొద్దంటూ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కూడా పబ్లిక్ మాత్రం మారడం లేదు.

రోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో కనీసం ఇప్పటినుంచి అయినా ఎవరు కూడా ఓఎల్ఎక్స్ లో నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పోలీసులు చెబుతుందని ప్రకారం సైబర్ నేరాల్లో అత్యధికంగా మోసానికి గురవుతున్న వారు చదువుకున్న వారే కావడం గమనార్హం.

పోలీసులు మీడియా పదేపదే సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నప్పటికీ విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం గమనార్హం.

You may also like

Leave a Comment