Telugu News » Diwali 2023 : లక్ష్మీదేవిని ఈ సమయంలో పూజిస్తే విశేష ఫలితాలు..!!

Diwali 2023 : లక్ష్మీదేవిని ఈ సమయంలో పూజిస్తే విశేష ఫలితాలు..!!

లక్ష్మీదేవి నుంచి సంపద, శ్రేయస్సు పొందాలనుకునేవారు దీపావళి నాడు శుభ సమయంలో అమ్మవారికి పూజ చేయాలి. ఈ సమయంలో పూజిస్తే లక్ష్మీ దేవి ఖచ్చితంగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని హిందూ గ్రంధాలు తెలుపుతున్నాయి.

by Venu

హిందువుల (Hindu) పండుగలలో (Festival) దీపావళి (Diwali) చాలా ముఖ్యమైనది. కార్తీక మాసంలో, అమావాస్య నాడు జరుపుకునే ఈ పండుగ లక్ష్మీ దేవత (Goddess Lakshmi) పూజకు విశేషమని పండితులు చెబుతారు.. కాగా ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని హిందూ భక్తులు నమ్ముతారు.

అంతేకాకుండా భూమిపై మహాలక్ష్మి అమ్మవారు దీపావళి రాత్రి సంచరిస్తుందని.. ఈ సమయంలో మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచే వారి ఇళ్లలో ఆ తల్లి శాశ్వతంగా నిలుస్తుందని హిందువులు నమ్ముతారు. అయితే దీపావళి రోజున ఏ సమయంలో పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్ష్మీదేవి నుంచి సంపద, శ్రేయస్సు పొందాలనుకునేవారు దీపావళి నాడు శుభ సమయంలో అమ్మవారికి పూజ చేయాలి. ఈ సమయంలో పూజిస్తే లక్ష్మీ దేవి ఖచ్చితంగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని హిందూ గ్రంధాలు తెలుపుతున్నాయి. అయితే ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజను రెండు శుభ సమయాల్లో జరుపుకోవచ్చని పండితులు తెలుపుతున్నారు. మొదటి శుభ ముహూర్తం నవంబర్ 12 (ప్రదోష కాలం) సాయంత్రం 5.28 నుంచి ప్రారంభమై రాత్రి 8.07 వరకు ఉంటుందని వారు చెబుతున్నారు.

అమ్మవారికి ఈ కాలంలో పూజలు చేయడం ఉత్తమం అంటున్న పండితులు.. రెండవ శుభ సమయం (నిషిత్ కాల్) రాత్రి 11:39 నుండి 12:32 వరకు లక్ష్మీ పూజ కోసం శుభ గడియలుగా వెల్లడిస్తున్నారు. ఇక దీపావళి పండుగ కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈసారి దీపావళిని దేశవ్యాప్తంగా నవంబర్ 12న జరుపుకుంటున్నారు. మరోవైపు దీపావళి కార్తీక అమావాస్య.. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమై.. 13వ తేదీ మధ్యాహ్నం 2:57 గంటల వరకు కొనసాగుతుందని వేద పండితులు వెల్లడించారు..

తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించి లక్ష్మీ దేవిని పూజించాలి. గులాబీ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీ దేవిని పూజిస్తే ఇంకా మంచిదని అంటున్నారు. లక్ష్మీదేవికి కమల పువ్వును సమర్పించడం దీపావళి ఆరాధన సమయంలో ఉత్తమమైనది. ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు మీ సొంతం అవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

You may also like

Leave a Comment