దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని పట్టి పీడిస్తున్న భూతం వాయు కాలుష్యం.. ఈ కాలుష్యం పై దాఖలైన పిటిషన్ల విచారణను ఈ రోజు సుప్రీం కోర్టు (Supreme Court) చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్యకట్టడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.. కాలుష్యాన్ని నివారించడంలో కేజ్రీవాల్ (Kejriwal) సర్కార్ విఫలమైందని తెలిపింది.
పంట వ్యర్థాలు తగలబెట్టడమే కాలుష్యానికి ప్రధాన కారణం అన్న అంశంపై విచారిస్తుండగా.. దీనిపై అమికస్గా ఉన్న అపరాజితా సింగ్ న్యాయస్థానానికి ఓ నివేదిక సమర్పించారు.. మొత్తం కాలుష్యంలో పంటవ్యర్థాల దగ్ధం 24 శాతం మేర ప్రభావం చూపుతోందని నివేదికలో తెలిపారు. దీనిపై స్పందించిన అత్యున్నత ధర్మాసనం కాలుష్య మూలాలను అరికట్టే చర్యలు సత్వరమే చేపట్టాలని స్పష్టం చేసింది..
మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని (Stubble Burning) ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్ట్.. తాము పదేపదే జోక్యం చేసుకుంటేనే వేగం వస్తుందా..? అంటూ మందలించింది.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. మరోవైపు కేజ్రీవాల్ సర్కార్ ఈ అంశం పై వివరణ ఇచ్చింది. సరి–బేసి విధానాన్ని సుప్రీంకోర్టు సమీక్ష తరువాత అమల్లోకి తీసుకోస్తామని చెప్పింది.