Telugu News » Delhi: రాజధాని ఢిల్లీకి పొగమంచు కష్టాలు.. ఆగిపోయిన విమాన సర్వీసులు..!

Delhi: రాజధాని ఢిల్లీకి పొగమంచు కష్టాలు.. ఆగిపోయిన విమాన సర్వీసులు..!

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దయ్యాయి. ఇక రైల్వే స్టేషన్‌ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతోంది.

by Mano
Delhi: Capital Delhi is suffering from fog.. Flight services are stopped..!

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Delhi: Capital Delhi is suffering from fog.. Flight services are stopped..!

పొగమంచు(Fog) వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ఇక రైల్వే స్టేషన్‌ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో దట్టమైన పొగమంచు తీవ్రంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీలోని సఫ్టర్ జంగ్‌లో 3.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.

ఉత్తర భారతమంతా తీవ్రమై చల్లని గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా అన్ని ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లో ఎటు వెళ్లాలన్నా పొగమంచు అడ్డంకిగా మారుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

You may also like

Leave a Comment