ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(DDA) ఛతరూర్లోని దివంగత వ్యాపారవేత్త పాంటీ చద్దా(Panty Chadha) ఫామ్‌హౌస్(Farmhouse)కు శనివారం బుల్డోజర్ను పంపింది. దాదాపు పది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో ఎక్కువ భాగం ప్రభుత్వ భూమిలో ఉన్నదని గుర్తించారు.
ఈ మేరకు కూల్చివేతను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కూల్చివేత సమయంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ కూల్చివేత పనులు శుక్రవారం ప్రారంభం కాగా ఆదివారం వరకు కొనసాగాయి. దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్లో మాజీ మద్యం వ్యాపారి పాంటీ చద్దా అలియాస్ గుర్దీప్ సింగ్ ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు రాజ్‌నివాస్ వర్గాలు తెలిపాయి.
అయితే ఇందులో చాలా వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడంతో అధికారులు పలుమార్లు వారికి నోటీసులు పంపించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే వినిపించుకోకపోవడంతో కూల్చివేత పనులు ముమ్మరం చేసినట్లు డీడీఏ వెల్లడించింది.
2012 నవంబర్‌లో ఈ ఫామ్‌హౌస్‌లో జరిగిన కాల్పుల్లో పాంటీ చద్దా, అతడి సోదరుడు హర్దీప్ మృతిచెందినట్లు సమాచారం.. ఆస్తి తగాదాల కారణంగానే అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నట్లు చెప్పారు.