Telugu News » Delhi liquor policy case: ఢిల్లీ మద్యం కుంభకోణం.. కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు..!

Delhi liquor policy case: ఢిల్లీ మద్యం కుంభకోణం.. కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు..!

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.

by Mano
Delhi liquor policy case: Delhi liquor scam.. Kejriwal summoned by ED for the fifth time..!

మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.

Delhi liquor policy case: Delhi liquor scam.. Kejriwal summoned by ED for the fifth time..!

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఐదోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

గ‌తంలో న‌వంబ‌ర్ 2, డిసెంబ‌ర్ 21, జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. అయితే, నాలుగు సార్లూ ఈడీ నోటీసులను కేజ్రీవాల్ లెక్కచేయలేదు.

ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు. మరి ఈసారైనా ఆయన హాజరవుతారో లేదో చూడాలి.

You may also like

Leave a Comment