దేశంలో జరిగిన ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కాం (Liquor Scam) గురించి ప్రత్యేకంగా చర్చించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మ్యాటర్ దాదాపు రెండేళ్లుగా నానుతూనే ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొన్న సీబీఐ (CBI).. వారిని అరెస్టు చేసి జైలుకు పంపించింది.. ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal), బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది.
ఇక ఈ స్కామ్ కు సంబంధించిన మ్యాటర్ బయటికి లీక్ ఆవడంతో.. రాజకీయాల్లో ప్రకంపనాలు మొదలైయ్యాయి. అప్పటి నుంచి అరవింద్ కేజ్రివాల్ ను ఈడీ వెంటాడుతోంది. ఈ క్రమంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రివాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో అరెస్టు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోందిని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే కేసులో సీబీఐ కవితను నిందితురాలిగా చేర్చింది..
ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్‌లో వచ్చేవారం ఇద్దరు పెద్దలు అరెస్ట్ అవుతారన్న టాక్ ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది. అందులో మొదటి వ్యక్తి కేజ్రీవాల్.. సెకండ్ పర్సన్ కవిత అని చర్చించుకొంటున్నారు.. మరోవైపు ఇదొక రాజకీయ డ్రామాగా భావిస్తున్నారు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకొన్నందుకు కేజ్రీవాల్‌ని.. బీఆర్ఎస్‌తో పొత్తు లేదని చెప్పడానికి కవిత అరెస్ట్ అనే డాక్యుమెంటరీ చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మూడు రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదని ఆప్ మంత్రులు చెబుతున్నారు.
బీజేపీ ఏం చేసినా మేం రెడీ.. మీ చేతనైంది చేసుకోండి అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే జరిగితే ఢిల్లీలో జనం రోడ్ల మీదకు వస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితపై, సీబీఐ దాదాపు ఏడాది తర్వాత యాక్షన్ కు దిగింది. ఈ కేసు మళ్లీ ఓపెన్ చేసింది. తాజాగా ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా కవితకునోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా అప్రూవర్‌గా మారిన రాఘవరెడ్డితో పాటు కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో సాక్షి ఉన్న కవిత కాస్తా, నిందితురాలుగా మారింది. అందుకే 41A నిబంధన కింద సీబీఐ నోటీసులు ఇచ్చిందంటున్నారు.
ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తే.. ఎవరైనా సరే.. సీబీఐ ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిందే. లేకపోతే.. కోర్టు ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం సీబీఐకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ తప్పదా?.. అనే చర్చ మొదలైంది. మరోవైపు ఈ కీలక పరిణామాలతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న బంధం ఫెవికాల్ కంటే ధృఢమైంది అనే నింద తొలగిపోయి.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయకుండా ఉండటానికే కమలం ఈ చర్యలకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా రాష్ట్ర రాజకీయాలను గాలికి వొదిలి.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టకుంటే బాగుండుననే వాదన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోంది.