ఢిల్లీ లిక్కర్ స్కాం (Liquor Scam) ప్రస్తుతం ఉత్కంఠంగా మారిన విషయం తెలిసిందే. గత 2 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయనను ఈ కేసులో కుట్రదారుడిగా అభివర్ణించింది. మరోవైపు మద్యం తయారీ దారులు, హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగిందని.. ఇందులో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి..
ఈ వ్యవహారంలో ఆప్ నేతలు ఢిల్లీ (Delhi) సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మొదలగు వీరంతా లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే క్రేజీవాల్ కు రూ. 100 కోట్ల మేర ముడుపులు అందాయని ఈడీ పేర్కొంటుంది. ఇదిలా ఉండగా 15 మంది పేర్లతో 2021 ఆగస్టు 19న లిక్కర్ స్కాం పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈమేరకు ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై 2022 ఆగస్టు 17న కేసు నమోదైంది. ఈమేరకు ఈడీ (ED), సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. కాగా లిక్కర్ స్కామ్‌లో తొలి అరెస్ట్.. సెప్టెంబర్ 27న జరిగింది. అప్ నేత విజయ్ నాయర్ ను అధికారులు అరెస్ట్ అయ్యారు. అక్టోబర్ 10న ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన బెయిల్ లభించింది.
అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్త బినోయ్ బాబు నవంబర్ 11న అరెస్ట్ అయ్యారు. 2022 నవంబర్ 26న ఈడీ తొలి చార్జ్‌షీట్ నమోదు చేసింది. నవంబర్ 29న అమిత్ అరోరా అరెస్ట్ అయ్యారు. సీబీఐ 2023 జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం గోరంట్ల బుచ్చిబాబు, 2023 ఫిబ్రవరి 8న.. అరుణ్ పిళ్లై, మార్చి 7న అరెస్ట్ అవ్వగా.. ఈ నెల 15న కవిత, తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు అరెస్ట్ లు జరిగాయి.
మరోవైపు ఈ స్కామ్ లో ముఖ్యమైన వ్యక్తుల అరెస్ట్ లు జరగడంతో ఈడీ నెక్ట్స్ స్టెప్ ఏంటనేది దేశ రాజకీయాలో ప్రస్తుతం తీవ్రంగా సాగుతున్న చర్చ.. కవిత, క్రేజీవాల్ అరెస్ట్ లతో ఈ కేసు చివరి దశకు చేరుకున్నట్లేనా?.. అరెస్టుల పర్వం ముగిసినట్లేనా?.. అనే ప్రశ్నలు మొదలైయ్యాయి. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అనే ఉత్కంఠ కూడా నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ అరెస్ట్‌లు ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి..