Telugu News » Lok Sabha Elections : మరో రెండు ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖరారు.. ప్ర‌క‌టించిన బీఆర్ఎస్..!

Lok Sabha Elections : మరో రెండు ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖరారు.. ప్ర‌క‌టించిన బీఆర్ఎస్..!

ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 13 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలైనా.. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ లో అభ్యర్థులు పెండింగ్‌లో ఉన్నారు.

by Venu
cm kcr submitted resignation letter to governor

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్నారు.. ఈ క్రమంలో మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు గానూ ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ (BRS) లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. నాగర్ కర్నూల్ (Nagarkurnool) పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఖరారు చేశారు. అలాగే.. మెదక్ (Medak) పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి.వెంకట్రామ్ రెడ్డిని (P Venkatrami Reddy) ఖరారు చేశారు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 13 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలైనా.. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ లో అభ్యర్థులు పెండింగ్‌లో ఉన్నారు. ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.. ఇక మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్.. వినోద్ కుమార్, కరీంనగర్.. కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు..

అదేవిధంగా జహీరాబాద్ (Zaheerabad) నుంచి గాలి అనిల్ కుమార్.. ఖమ్మం (Khammam) నుంచి నామా నాగేశ్వర్ రావు.. మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితా.. వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు.. కాగా అభ్యర్థులను అయితే ప్రకటించారు కానీ ప్రచారంలో మాత్రం దూకుడు ప్రదర్శించడం లేదనే అపవాదు బీఆర్ఎస్ మూటగట్టుకొంటుందని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment