Telugu News » Musheerabad : ముషీరాబాద్‌లో అక్రమ ఇండ్ల కూల్చివేత….నెలకొన్న ఉద్రిక్తత….!

Musheerabad : ముషీరాబాద్‌లో అక్రమ ఇండ్ల కూల్చివేత….నెలకొన్న ఉద్రిక్తత….!

భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చి వేత చర్యలు మొదలు పెట్టారు. ఆ సమయంలో ఎవరిని అక్కడికి అనుమతించలేదు.

by Ramu
demolition of houses in musheerabad

ముషీరాబాద్‌ (Musheerabad)లో దళితుల ఇండ్లను అధికారులు కూల్చి వేశారు. గాంధీ నగర్ (Gandhi Nagar) డివిజన్‌ వివేకానంద నగర్‌లో సోమవారం ఉదయం అధికారులు పలు ఇండ్లను తొలగించారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చి వేత చర్యలు మొదలు పెట్టారు. ఆ సమయంలో ఎవరిని అక్కడికి అనుమతించలేదు.

demolition of houses in musheerabad

విషయం తెలుసుకన్న ధరణి విచారణ కమిటీ ఛైర్మన్‌ కోదండ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాధితులను పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలు కావడంతోనే వాటిని కూల్చి వేశామని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 70 ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని చెబుతున్నారు. స్థల వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. ఫిబ్రవరి 6న కేసు కోర్టు విచారణకు రానుందని చెప్పారు.

కానీ ఇంతలోనే అధికారులు తమ ఇండ్లను కూల్చి వేశారని వాపోతున్నారు. రోడ్డు, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను అధికారులు తొలగిస్తున్నారు. న్యాయస్థానంలో ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు రావ‌డంతో చ‌ర్య‌లు చేప‌ట్టారు. 2000 సంవత్సరం నుండి వివిధ రూపాల్లో కూల్చివేత‌ల‌ను స్థానికుల‌ను అడ్డుకుంటున్నారు.

You may also like

Leave a Comment